News

Bigg Boss Rathika: యావర్‌కి దెబ్బేసిన రతిక పాప.. ఛీఛీ అనుకొని తలపట్టుకున్న ప్రిన్స్ – bigg boss 7 telugu prince yawar felt bad about rathika rose decision


రతిక రోజ్.. ఏం ప్లేటు తిప్పింది బాసూ.. వీడియో చూసి యావర్‌కి దిమ్మతిరిగిపోయింది. హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు తక్కువగా జరుగుతున్నాయని బిగ్‌బాస్ పెద్ద ప్లానే వేశాడు. ఈరోజు ఉదయం మూడవ పవరాస్త్ర దక్కించుకునేందుకు ముగ్గురిని కంటెండర్లుగా సెలక్ట్ చేశాడు బిగ్‌బాస్. అమర్ దీప్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్‌లను కంటెండర్లుగా ప్రకటించాడు బిగ్‌బాస్. ఆ తర్వాత నెమ్మదిగా సెలక్ట్ చేయన కంటెస్టెంట్లను ఒక్కొక్కరిని పిలిచి ఆ ముగ్గురిలో ఎవరు కంటెండర్‌గా అనర్హులో చెప్పమని బిగ్‌బాస్ కోరాడు. కన్ఫెషన్ రూమే కదా అని ఎవరికి తోచినట్లు వాళ్లు వాళ్ల అభిప్రాయాన్ని చెప్పేశారు. తీరా చూస్తే సాయంత్ర పెద్ద బాంబు పేల్చాడు బిగ్‌బాస్.

రతిక పాప దింపింది

మొత్తం కంటెస్టెంట్లను టీవీ ముందు కూర్చోబెట్టి.. మూడో పవరాస్త్ర కోసం సెలక్ట్ చేసిన ముగ్గురు కంటెస్టెంట్ల ముందు ఇరికించేశాడు. ముందుగా యావర్‌ని కంటెండర్‌గా వ్యతిరేకిస్తూ తమ అభిప్రాయాన్ని చెప్పిన వారి వీడియోను టీవీలో చూపించాడు. ముందుగా టేస్టీ తేజ.. యావర్ హౌస్‌మెట్‌గా సరికాదని.. ఇంటి పనులు చేయడంటూ చెప్పాడు. ఇక ఆ తర్వాత దామిని.. యావర్‌కి అందరితో కనెక్షన్ లేదని, తెలుగు రాదంటూ సేమ్ సిల్లీ రీజన్స్ చెప్పి వ్యతిరేకిస్తున్నట్లు చెప్పింది.

ఇక అసలైన ట్విస్ట్ ఏంటంటే.. యావర్‌ను రతిక రోజ్ కూడా వ్యతిరేకించింది. యావర్‌కి కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువని.. ఇక్కడ హౌస్‌లో అది పనికిరాదంటూ చెప్పింది. ఫిజికల్ టాస్క్‌ల్లో యావర్ బాగా ఆడొచ్చు కానీ అతను హౌస్ మెట్‌గా పనికికారడంటూ బిగ్‌బాస్‌కి చెప్పింది. ఈ వీడియోను బిగ్‌బాస్ అందరిముందు టీవీలో చూపించాడు.

ఛీఛీ రతిక కూడానా

ఇక ఈ వీడియో చూసిన యావర్‌కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. రెండు చేతులు జేబులో పెట్టుకొని సైలెంట్‌గా లేచి గార్డెన్‌లోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తేజ వెళ్లి బ్రో నేను చెప్పింది నీకు అర్థమైందా అంటూ యావర్‌ని గెలికాడు. కనెక్ట్ కాలేదు.. ఇంటి పనులు చేయలేదు అంటే నేనేమైనా నీ పెళ్లాన్నా.. నీ బట్టలు ఉతకాలా అంటూ యావర్ రెచ్చిపోయాడు. పో.. నీ అభిప్రాయం నువ్వు చెప్పావ్ కదా.. వెళ్లు పో అంటూ సీరియస్ అయ్యాడు యావర్. ఇక ఆ తర్వాత రతిక కూడా దెబ్బేసింది.. ఛీఛీ అంటూ తలపట్టుకున్నాడు యావర్. ఆ తర్వాత సిగరెట్ తాగుతూ కోపంతో అక్కడే ఉన్న గ్లాస్ టీపాయిని గుద్దేశాడు యావర్. ఇది చూసి కంటెస్టెంట్లు కాస్త కంగారు పడ్డారు. ఇక చేసిందంతా చేసి రతిక మాత్రం ఏమైంది తనకు నా అభిప్రాయం నాది అంటూ సైడయిపోయింది.

  • Read latest TV News and Movie Updates

Related Articles

Back to top button