Bigg Boss Promo: అమర్‌దీప్ వెన్నుపోటు.. నేనేంటో చూపిస్తా అంటూ ప్రియాంక సవాల్ – bigg boss telugu 7 promo 2 priyanka jain got serious on amardeep and prince yawar watch video
ప్రోమో మొదట్లో నామినేషన్స్‌కి దామిని వచ్చింది. ఇద్దరికీ ఛాన్స్ ఉంది.. ఎక్కువమందికి ఉంటే బావుండేది.. అందరికీ వేసేసేదాన్ని అంటూ దామిని అంది. ఇక ఆ తర్వాత ప్రియాంక జైన్‌ను ప్రిన్స్ యావర్ నామినేట్ చేశాడు. యాటిట్యూడ్ అసలు బాగోలేదంటూ రీజన్ చెప్పాడు. దీంతో ప్రియాంక రెచ్చిపోయింది. నీ ఆటిడ్యూట్ కరెక్ట్‌గా ఉందా అంటూ ఫైర్ అయింది. ఇక ఆ తర్వాత శుభశ్రీ కూడా ప్రియాంకను నామినేట్ చేయడంతో వాదన పీక్స్‌కి వెళ్లిపోయింది. ఇది కరెక్ట్ కాదంటూ ప్రియాంక వేలు చూపిస్తూ సీరియస్ అయింది.
రామా కూడానా
ఇక ఆ తర్వాత మన రామా అదేనండి అమర్ దీప్ కూడా పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. రోటీ, కచ్‌రా మాత్రమే పెద్ద పని కాదు.. దానికి మించిన పనులు చాలా ఉన్నాయిరా అది ఒక్కటి గుర్తుపెట్టుకో అంటూ ప్రియాంకని నామినేట్ చేసేశాడు. దీంతో పొట్టి పిల్ల గట్టిగానే ఫైర్ అయింది. చేస్తే ఇప్పటి నుంచి పని.. చూపిస్తా ఒక్కొక్కరికి.. వెరీ నైస్ అంటూ ప్రియాంక అంది.
ఇక ప్రోమో చివరిలో మాత్రం ప్రశాంత్- తేజ మధ్య గొడవ నవ్వులు పూయించింది. పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేస్తూ నీకు బిగ్‌బాస్ ప్రక్రియ సరిగా అర్థం కావడం లేదని నా ఫీలింగ్ అంటూ తేజ చెప్పాడు. నాకు అర్థం కావడం లేదని నీకెలా తెలిసిందంటూ మంచి పాయింట్ లాగాడు ప్రశాంత్. అలానే నీకు అస్తమాను పాజిటివ్-నెగిటివ్ నా దగ్గరే తాకుతుందా అంటూ తనదైన స్టెయిల్లో అపరిచితుడిలా మారిపోయాడు ప్రశాంత్. దీంతో తేజ వచ్చి.. ప్రశాంత్ తొడ కొడుతూ కామెడీ చేశాడు. దీంతో మరోసారి తొడ కొడుతూ సవాల్ చేశాడు ప్రశాంత్. ఆ తర్వాత టేస్టీ తేజను ఇమిటేట్ చేస్తూ ప్రశాంత్ చేసిన కామెడీ మాత్రం అదిరిపోయింది. దీంతో హౌస్ మొత్తం తెగ నవ్వుకున్నారు. ఏం చెప్పాలో తెలీక తేజ కూడా నవ్వుకున్నాడు. ఈ ప్రోమోపై ఓ లుక్కేయండి.
- Read latest TV News and Movie Updates