Bigg Boss Priyanka,Priyanka Jain: అతను నన్ను లవ్ చేస్తున్నాడని అర్ధమైంది.. అందుకే దూరం పెట్టా: బిగ్ బాస్ ప్రియాంక – bigg boss fame priyanka jain about love proposal
మౌనరాగం ఫేమ్ శివకుమార్‌తో కొన్నేళ్లుగా రిలేషన్‌లో ఉంది ప్రియాంక. అఫీషియల్ పెళ్లి ఒక్కటే కాలేదు కానీ.. ప్రస్తుతం వీళ్లిద్దరూ అయితే సహజీవనం చేస్తున్నారు. ఒకే ఇంట్లో ఉంటున్నారు. పెళ్లి ఎప్పుడంతే మాత్రం త్వరలోనే అని అంటోంది ఈ జంట. అయితే శివ్ కుమార్‌తో కాకుండా అంతకు ముందు లవ్ ప్రపోజ్‌లు కానీ.. లవ్ స్టోరీలు కానీ ఏమీ లేవా? అంటూ ప్రియాంక జైన్.. నాకు ప్రపోజ్ చేసేటంత ధైర్యం ఎవడికి ఉంది? అంటూ ఆసక్తికమైన సమాధానం ఇచ్చింది. తనో లవ్ డాక్టర్ మాదిరిగా.. ఎవరైనా తనని ఇష్టపడుతున్నారంటే తనకి ముందే తెలిసిపోతుంది అని అంటోంది ప్రియాంక.
బిగ్ బాస్‌కి వెళ్లక ముందు ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ.. ‘లవ్ ప్రపోజ్‌లు వస్తుంటాయి.. కాని నేను ముందే జాగ్రత్త పడతా..అతను ఐలవ్యూ చెప్తాడని నాకు ముందే తెలిసిపోయింది. ప్రపోజ్ చేస్తాడని అర్ధమైంది. అందుకే ముందే వద్దని చెప్పేశా.. దూరం పెట్టేశా. అమ్మాయిలకు ముందే తెలిసిపోతుంది. ఎదుటి వ్యక్తి ఉద్దేశం ఏంటో. నాకు డైరెక్ట్‌గా ప్రపోజ్ చేసే ధైర్యం ఎవరికీ లేదేమో.. అందుకే ఎవరూ ప్రపోజ్ చేయలేదు. ఎందుకంటే నేను చాలా బోల్డ్.. ఏదైనా ముఖం మీదే మాట్లాడతా. నాకు క్రష్ కూడా ఎవరిపై లేదు. నాకు ఎవరూ ప్రపోజ్ చేయలేదు.. నేను ఎవరికీ ప్రపోజ్ చేయలేదు’ అని చెప్పింది ప్రియాంక.
సినిమాల్లో హీరోయిన్‌గా.. ఇప్పుడు ఇలా..
గోలీసోడా అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ప్రియాంక జైన్. ఆ తరువాత వరుసగా మూడు సినిమాల్లో సహ నటిగా అవకాశం వచ్చింది. మెయిన్ హీరోయిన్‌గా మాత్రం ఛాన్స్ అందుకోలేకపోయింది ప్రియాంక జైన్. చూడ్డానికి హీరోయిన్ మెటీరియలే అయినా.. ఆమె హైట్ మైనస్ కావడంతో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకోలేకపోయింది ప్రియాంక జైన్.
ఇక కన్నడ ఇండస్ట్రీలో లాభంలేదనుకున్న ప్రియాంక జైన్.. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యింది. హీరోయిన్‌గా గట్టిగానే ప్రయత్నాలు చేసింది. చల్తే చల్తే సినిమాలో హీరోయిన్‌గా అవకాశం అందుకుంది. ఆ తరువాత ‘వినరా సోదరా వీరకుమారా’ అనే సినిమాలోనూ నటించింది కానీ ఈ రెండు సినిమాలు బెడిసికొట్టాయి. అయితే ఆమె అనుకున్నట్టుగానే హీరోయిన్ అయ్యింది.. అవ్వడం కాదు.. సూపర్ సక్సెస్ అయ్యింది. అయితే వెండితెరపై కాదు బుల్లితెరపై. మౌనరాగం సీరియల్‌తో బుల్లితెరపై సూపర్ హిట్ సీరియల్‌లో నటించింది. మౌనరాగం అమ్ములుగా అద్భుత నటనతో ఆకట్టుకుంది.
ఆ తరువాత ‘జానకి కలగనలేదు’ సీరియల్‌లో జానకి ఐపీఎస్ ఆకట్టుకునే ప్రయత్నం చేసి.. మౌనరాగంతో సంపాదించిన పేరుని చెడగొట్టుకుంది. నటన పరంగా ప్రియాంకకి పేరు పెట్టలేం కానీ.. ‘జానకి’ సీరియల్‌లో ఐపీఎస్‌గా ఆమె అస్సలు సెట్ కాలేదు. ఆమె హైట్‌కి పోలీస్ క్యారెక్టర్‌కి సెట్ కాలేకపోవడంతో.. ఆ సీరియల్‌ని అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. ఆ సీరియల్ అలా ముగిసిందో లేదో.. ఇలా బిగ్ బాస్ హౌస్‌లో వంటలక్కగా మెరుస్తోంది ప్రియాంక జైన్.