News

Bigg Boss nagarjuna, Bigg Boss 6 Telugu Episode 83: బిగ్‌బాస్‌ హౌస్‌ని హోరెత్తించిన గెస్ట్‌లు.. ఆదిరెడ్డి చెల్లెలు హైలైట్.. నవ్వులే నవ్వులు – nagarjuna telugu bigg boss season 6 november 26 written updates; host welcomes some ex-contestants and friends of the contestants


Authored by Rajendra Galeti | Samayam Telugu | Updated: 27 Nov 2022, 12:06 am

Bigg Boss 6 Telugu November 26 Episode చాలా ఇంట్రస్టింగ్‌గా జరిగింది. కంటెస్టెంట్స్‌ ఫ్యామిలీ మెంబర్స్‌లో కొంత మంది చాలా సరదాగా అనిపించగా.. మరికొందరు సెంటిమెంట్ పండించి ప్రేక్షకుల్ని కూడా కంటతడి పెట్టించారు. మధ్యలో పైమా కోసం వచ్చిన బుల్లెట్ భాస్కర్ వేసిన పంచ్‌లు నవ్వులు పూయించాయి. శ్రీహాన్‌, సిరి లవ్ ట్రాక్ గురించి సొహైల్ చెప్పిన తీరు ఆసక్తిగా అనిపించింది. నాగార్జున హౌస్‌మెట్స్ గురించి ఎవరికీ తెలియని విషయాల్ని ఫ్యామిలీ మెంబర్స్‌తో చెప్పించే ప్రయత్నం చేశాడు.

 

ప్రధానాంశాలు:

  • బిగ్‌బాస్ శనివారం ఎపిసోడ్‌లో ఆదిరెడ్డి చెల్లెలు హైలైట్
  • రాజ్ కోసం వచ్చిన బుల్లితెర మెగాస్టార్
  • పైమా కోసం వచ్చిన బుల్లెట్ భాస్కర్
  • శ్రీహాన్‌ని ఇరికించిన సొహైల్.. ఇనయతో లవ్ ట్రాక్
Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ హౌస్‌ (Bigg Boss) శనివారం గెస్ట్‌లతో హెరెత్తిపోయింది. ఈరోజు హౌస్‌మెట్స్ ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు చాలా మంది స్పెషల్ గెస్ట్‌లు కూడా వచ్చి సందడి చేశారు. ఆదిరెడ్డి చెల్లెలు నాగలక్ష్మి ఈరోజు ఎపిసోడ్‌కి హైలైట్‌గా నిలవగా.. పైమా అక్క వచ్చి రావడంతో సెంటిమెంట్ పండించింది. ఇక ఇనయ, సొహైల్ మధ్య లవ్ ట్రాక్.. మధ్యలో శ్రీహాన్‌ని ఇరికించడం నవ్వులు పూయించింది. ఓవరాల్‌గా ఈరోజు ఎపిసోడ్ చాలా సరదాగా జరిగిపోయింది.

* ఇనయ () కోసం సొహైల్ వచ్చాడు. దాంతో ఇద్దరి మధ్య క్రష్ వెలుగులోకి వచ్చింది. గత ఏడాది నుంచి సొహైల్‌ నుంచి ఫాలో అవుతున్నట్లు అందరి ముందు చెప్పిన ఇనయ.. అతని కోసం మణికొండకి కూడా షిప్ట్ అయినట్లు ఒప్పుకుంది. అలానే సొహైల్‌ కోసం జిమ్‌లో చేరితే.. అక్కడ ఇద్దరు అమ్మాయిలతో కలిసి అతను జిమ్ చేస్తుండటాన్ని చూసి హర్ట్ అయ్యి వెళ్లిపోయిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. సొహైల్‌తో పాటు ఇనయ తమ్ముడు కూడా బిగ్‌బాస్ హౌస్‌కి వచ్చాడు. ఇనయకి ఆమె తమ్ముడు 9 మార్కులే ఇచ్చాడు. అలానే ఆమెకి హౌస్‌లో కాంపిటేటర్‌గా రేవంత్‌ని సెలెక్ట్ చేయగా.. ఆదిరెడ్డి కాంపిటేటర్ కాదని తేల్చాడు. మధ్యలో శ్రీహాన్, సిరి లవ్ ట్రాక్‌ని కూడా సొహైల్ ప్రస్తావించాడు.

* శ్రీహాన్ కోసం వాళ్ల నాన్నతో పాటు బిగ్‌బాస్ మాజీ విజేత శివ బాలాజీ కూడా వచ్చాడు. శ్రీహాన్ సిరిని ఇంట్లో ఫ్రెండ్‌గా పరిచయం చేయడం.. ఆ తర్వాత ఇంట్లో వాళ్లకి డౌట్ రావడం.. చివరికి శ్రీహాన్ తల్లి.. అతనితో సిరిని చెల్లెలు అని పిలిపించడానికి ట్రై చేయడం ఇలా మొత్తం విషయాల్ని శ్రీహాన్‌తో చెప్పించారు. శ్రీహాన్‌కి కాంపిటేషన్ రేవంత్ అని చెప్పుకొచ్చిన శివబాలాజీ.. పైమా అతనికి కాంపిటేషన్ కాదని స్పష్టం చేశాడు. అలానే శ్రీహాన్‌కి 9 మార్కులు ఇచ్చాడు.

* పైమా కోసం బుల్లెట్ భాస్కర్‌తో కలిసి పైమా అక్క వచ్చింది. వచ్చీ రాగానే పైమాని చూసి స్టేజ్‌పైనే ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. దాంతో ఇద్దరూ కాసేపు ఏడ్చేశారు. ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ తన పంచ్‌లతో అందరినీ నవ్వించాడు. మరీ ముఖ్యంగా.. ఇనయని ఉద్దేశిస్తూ.. నీ నోటి దెబ్బకి వీధుల్లో 10 టీవీలు ఉంటే.. 9 టీవీల్ని మ్యూట్‌లో పెట్టి చూస్తున్నారని సెటైర్ వేశాడు. పైమాకి కాంపిటేషన్ ఇనయ అని.. శ్రీసత్య అసలు కాంపిటేషన్ కాదని బుల్లెట్ భాస్కర్ చెప్పుకొచ్చాడు. పైమాకి 10కి పది మార్కులు వాళ్లు వేశారు.

* రేవంత్ కోసం అతని సోదరుడు, రోల్ రైడా వచ్చాడు. రేవంత్ తన ఇంట్లో వాళ్ల అందరి కంటే పొడవు తక్కువట. అతను చెప్పినట్లే రేవంత్ అన్నయ్య బాహుబలిలా కనిపించాడు. రేవంత్ గురించి ఫన్నీ విషయాలు చెప్తూ.. టీచర్‌ని కూడా టీజ్ చేసి.. వీపుని చూపిస్తూ ఇక్కడ కొట్టూ అనేవాడని గుర్తు చేసుకున్నాడు. రోల్ రైడ ర్యాంప్ పాడు.

* రోహిత్ కోసం అతని సోదరుడు డింపు, టాలీవుడ్ మెగాస్టార్‌గా అభిమానులు సరదాగా పిలుచుకునే ప్రభాకర్ వచ్చాడు. పెద్దగా విషయాలు ఏమీ చెప్పలేదు. కానీ.. అతనికి కాంపిటేషన్‌ మాత్రం రేవంత్ అని.. రాజ్ అతనికి కాంపిటేటర్ కాదని చెప్పుకొచ్చారు.

Advertisement

* ఆది రెడ్డి కోసం అతని చెల్లెలు నాగలక్ష్మి, నటి లహరి వచ్చారు. కళ్లు కనిపించని నాగలక్ష్మి‌ని నాగార్జున స్వయంగా వెళ్లి చేయి పట్టుకుని స్టేజ్‌పైకి తీసుకొచ్చారు. రివ్యూ చెప్తున్న నువ్వు కంటెస్టెంట్ అయ్యావు.. అలానే విన్నర్ కావాలంటూ ఆమె ఆదిరెడ్డికి సూచించింది. ఆమెకి చూపులేకపోయినా.. యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయ్యిందని గుర్తు చేసుకున్న ఆదిరెడ్డి.. ఐదేళ్ల పాటు ఆమె పెన్షన్‌తో తాము బతికినట్లు గుర్తు చేసుకున్నాడు. ఆదిరెడ్డి అమ్మ చనిపోయిన రోజు.. తనని ఓదార్చే క్రమంలో ఏడ్చాడని.. ఆ తర్వాత ఇప్పటి వరకూ ఏడ్వలేదని.. ఇకపై కూడా ఏడవడు అంటూ ధీమాగా నాగలక్ష్మి చెప్పింది. లహరి మాట్లాడుతూ ఆదిరెడ్డి మంచితనంపై ప్రశంసల వర్షం కురిపించింది. అందరికీ సాయం చేస్తాడని.. ఒకవేళ సాయానికి అవసరమైన డబ్బు కంటే ఎక్కువ వస్తే? దాతలకి రిటర్న్ చేస్తాడని గుర్తు చేసుకుంది.

* శ్రీసత్య కోసం తన ఫ్రెండ్ హారిక, సీరియల్ నటి విష్ణు వచ్చారు. శ్రీసత్య ఎప్పుడూ తింటూ ఉంటుందని.. ఫోన్ లేకుండా ఉండలేదని ఫ్రెండ్ హారిక గుర్తు చేసుకుంది. అలానే శ్రీసత్య తల్లి అనారోగ్యం గురించి కూడా ప్రస్తావిస్తూ.. ఆమెకి రోజూ ఫిజియోథెరపీ జరుగుతోందని కంగారు పడద్దంటూ ఫ్రెండ్ హామీ ఇచ్చింది.

* రాజ్ కోసం డాక్టర్ వెంకీ, సాయి రోణక్ వచ్చారు. బయట రాజ్ చాలా సెలైంట్ అని వెంకీ గుర్తు చేసుకున్నాడు. మినిమం ఉంటాది.. మనతోని అని రాజ్‌లో ఉత్సాహం నింపాడు. రాజ్‌కి రోహిత్ కాంపిటేషన్ అని.. ఇనయ నుంచి అతనికి కాంపిటేషన్‌ లేదని వాళ్లు చెప్పుకొచ్చారు.

* కీర్తి కోసం.. ప్రియాంక, వితిక శేరు వచ్చారు. నీకు ఎవరూ లేరని బాధపడకు అని కీర్తికి ధైర్యం చెప్పిన వితిక.. తన ఇంటికి భోజనానికి రావాలని ఆహ్వానించింది. ఆమెకి కాంపిటేషన్ శ్రీహాన్ అని.. శ్రీసత్య ఆమెకి కాంపిటేషన్ కాదని వాళ్లు చెప్పారు

చివరిగా నామినేషన్‌లో ఉన్న వారిలో ఇనయ, శ్రీ సత్య, శ్రీహాన్ శనివారం సేఫ్ అయ్యారు. పైమా, రోహిత్, ఆదిరెడ్డి ,రాజ్ అన్‌సేఫ్‌గా మిగిలిపోయారు. ఈ నలుగురిలో ఒకరు ఆదివారం ఎలిమినేట్ కానున్నారు.

Read more Cinema News and Telugu News, TV News

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related Articles

Back to top button