News

Bigg Boss 7 Telugu: మరోసారి రచ్చ చేసిన రతికా.. అర్జున్ గట్టిగానే ఇచ్చాడుగా.. దెబ్బకు పదోస్థానానికి – Telugu News | Bigg Boss Telugu 7 Day 73 Performance Ranking Task for Contestants


బిగ్ బాస్ 7 లో నామినేషన్స్ గరం గరంగా సాగాయి. ఈవారం నామినేషన్స్ లో ఏకంగా ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. రతికా, అమర్, గౌతమ్, యావర్, అశ్విని, శోభా శెట్టి, అర్జున్, ప్రశాంత్ ఈవారం నామినేట్ అయ్యారు. ఇక నామినేషన్స్ సమయంలో రతికా చేసిన అతి మాత్రం మాములుగా లేదు. ఇక నామినేషన్స్ తర్వాత నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోలో ప్రస్తుతం హౌస్ లో పదిమంది ఉన్నారు. ఎవరెవరు ఏ స్థానానికి అర్హులు అనేది తెలుసు కొసవడానికి బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ముందుగా హౌస్ మేట్స్ ఈ పది వారాల్లో ఓవర్ ఆల్ పర్ఫామెన్స్ దృష్టిలో పెట్టుకొని. హౌస్ మేట్స్ తమకు గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన నెంబర్స్ దగ్గరకు వెళ్లి నిలబడాలని ఆ తర్వాత హౌస్ మేట్స్ అంతా చెర్చించి ఎవరు ఏ స్థానంలో ఉన్నారో డిసైడ్ చేసుకోవాలని చెప్పారు.

దాంతో ఒకొక్కరు తమకు ఇచ్చిన నెంబర్స్ దగ్గర నిలబడ్డారు. ఇక్కడ కూడా రతికా అతి చేసింది. నేను 5 అనుకుంటున్నా.. టాప్ 5లో నేను ఉండాలనుకుంటున్నా అని అంది. ఆతర్వాత శివాజీ రతికాను లాస్ట్ వీక్ పర్ఫామెన్స్ మాత్రం 50 నుంచి 60 వరకు మాత్రమే వచ్చింది అని అన్నాడు. ఆతర్వాత అర్జున్ తన ఒపీనియన్ చెప్పాడు. 10 ప్లేస్ కరెక్ట్ అని నేను అనుకుంటున్నా అని చెప్పాడు. ఆతర్వాత రతికా శివాజితో డిస్కషన్ మొదలు పెట్టింది. హోస్ డెసిషన్ అని శివాజీ నచ్చజెప్పడంతో వెళ్లి పదోవ ప్లేస్ లో నిలబడింది.

ఆతర్వాత అమర్ నాకు ఒకటో స్థానంలో ఉండాలని ఉంది అని చెప్పాడు. లాస్ట్ వీక్ చూసిన దాన్ని బట్టి నేను ఆరో స్థానం అనుకుంటున్నా అని గౌతమ్ అన్నాడు. మొదటి స్థానం నాది అని మరీ మరి చెప్తున్నాను అని అన్నాడు అమర్. ఆతర్వాత రతికా ప్రియాంక, షోలతో ఎదో మాట్లాడింది. ఆతర్వాత అర్జున్ తో గొడవ పడింది. అర్జున్ గోడ మీద పిల్లిలా ఆన్సర్ చెప్పొద్దూ అని అనడంతో రతికా రెచ్చిపోయింది. అర్జున్ కూడా రతికా మీద సీరియస్ అయ్యాడు. ఆతర్వాత శోభా శెట్టిని నువ్వు ఇండివిడ్యువల్ గా నువ్వు చేయడం లేదు అని అనగానే నా ఎఫర్ట్స్ ఏం లేవా.? అని తిరిగి ప్రశ్నించింది శోభా. ఫైనల్ గా ఎడో స్థానం ఇవ్వడంతో కన్నీళ్లు పెట్టుకుంది.



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Back to top button