Entertainment

Bigg Boss : బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆ కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్‌.. టెన్షన్‏ పడుతోన్న ఆ నటి..


Bigg Boss : బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆ కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్‌.. టెన్షన్‏ పడుతోన్న ఆ నటి..

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్‌. ఇప్పుడు అన్ని భాషల్లోనూ ఈషోకు మంచి ప్రేక్షాకదరణ లభిస్తుంది. ఇప్పటికే తెలుగులో ఆరు సీజన్స్ కంప్లీట్ చేసుకుని ఏడో సీజన్ రన్ అవుతుంది. ఇక తమిళ్, కన్నడతోపాటు హిందీలోనూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అయితే హిందీ బిగ్‌బాస్‌ రియాల్టీ షోలోకి మొదటి రోజు నుంచే హాట్ టాపిక్‍గా మారిన జంట అంకితా లోఖండే, విక్కీ జైన్. ఈ రియల్ కపూల్ బిగ్‌బాస్‌ సీజన్ 17లోకి అడుగుపెట్టారు. కానీ వెళ్లిన మరుసటి రోజు నుంచి వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇక బిగ్‌బాస్‌ సైతం వీరి మధ్య చిచ్చు పెట్టేందుకు ఎక్కువగానే ట్రై చేశాడు. అప్పుడే గొడవ పడడం.. ఆ వెంటనే కలిసిపోయేవారు. అయితే ఇప్పుడు నటి అంకితా చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. బిగ్‌బాస్‌ హౌస్ లో తనకు ప్రెగ్నేన్సీ టెస్ట్ చేశారని.. తనకు పీరియడ్స్ కూడా మిస్ అయ్యాయంటూ తన భర్తతో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను ప్రెగ్నెన్సీ టెస్ట్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలిపింది.

అంకితా మాట్లాడుతూ.. “నాకు ఒంట్లో బాగోలేనట్లుగా ఉంది. ఈనెల పీరియడ్స్ కూడా రాలేదు. ఇంటికి వెళ్లాలనిపిస్తోంది. నన్ను మెడికల్ రూంకు పిలిచి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారు. నిన్న రక్తపరీక్షలు చేశారు. ఈరోజు యూరిన్ టెస్ట్ చేశారు. కానీ ఫలితాలను మాత్రం చెప్పలేదు. నా భావోద్వేగాలను చెప్పలేకపోతున్నాను. నా ఫీలింగ్స్ వివరించలేకపోతున్నాను. ప్రస్తుతం నేను అయోమయంలో ఉన్నాను. అందుకు నేను మిమ్మల్ని నిందించను.” అంటూ తన భర్తతో చెప్పుకొచ్చింది అంకితా.

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv)

అంకితా భర్త విక్కీ జైన్ దాదాపు రూ.4 కోట్లు చెల్లించి తన భార్యతో కలిసి బిగ్‌బాస్‌ హౌస్ నుంచి బయటకు వచ్చేందుకు సుముఖతను చూపించాడు. అయితే వీరిద్దరూ హౌస్ లో కొనసాగుతారా ?.. లేదా బయటకు వచ్చేస్తారా ?. అనేది చూడాలి. హిందీ సీజన్ 17కు సల్మాన్ ఖాన్ హోస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

 

View this post on Instagram

 

Advertisement

A post shared by Vikas Jain (@realvikasjainn)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Related Articles

Back to top button