News
big twist in medico preeti case, మెడికో ప్రీతి కేసులో దిమ్మదిరిగిపోయే ‘ట్విస్ట్’.. టాక్సికాలజీ రిపోర్టుతో సీన్ మొత్తం రివర్స్ – big twist in medico preeti suicide case with toxicology report
కాగా.. ఈ రిపోర్ట్ వరంగల్ సీపీ రంగనాథ్ చేతికి చేరింది. దీంతో.. ఇన్ని రోజులు ఆత్మహత్యాయత్నం కేసుగా పరిగణించిన కేసును.. ఇప్పుడు అనుమానాస్పద మృతి కేసుగా మార్చే యోచనలో పోలీసులు పడ్డారు. ఈ నేపథ్యంలోనే వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ రేపు హైదరాబాద్ రానున్నారు. తెలంగాణ డీజీపీ నుంచి సీపీకి ఫోన్ వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఈ కేసు గురించి వివరించేందుకు సీపీ నేరుగా హైదరాబాద్ రానున్నట్టు సమాచారం. మరోవైపు.. నిందితుడు సైఫ్ హోం మంత్రికి సమీప బంధువు అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుందోనన్న చర్చ జరుగుతోంది.
అయితే.. ప్రీతి మృతి.. అసలు హత్యా.. ఆత్మహత్యా.. అన్న విషయం ఎటూ తేల్చుకోలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అయితే.. ముందు నుంచి ప్రీతిది హత్యే అంటూ ఆమె కుటుంబసభ్యులు మాత్రం వాదిస్తూనే ఉన్నారు. అందుకు సంబంధించి.. పలు అనుమానాలను కూడా ప్రీతి తండ్రి మీడియా ముందు వ్యక్తం చేశారు. ప్రీతి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చుకుని ఉంటే.. శరీరంపై ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదంటూ అనుమానం వ్యక్తం చేశారు. ప్రీతి స్పృహలో లేనప్పుడు ఆమె ఫోన్‌లో పాయిజన్ ఇంజెక్షన్ గురించి సెర్చ్ చేసి.. కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారంటూ ఆరోపించారు కూడా. ముందు నుంచి వాళ్లు ఆరోపిస్తున్నట్టుగానే.. ఆమె శరీరంలో ఎలాంటి విష పదార్థాలు దొరకపోవటం పెద్ద ట్విస్టే. ఈ కేసులో ఇప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్ని సర్వత్రా ఉత్కంఠగా మారింది.
- Read More Telangana News And Telugu News