chatrapathi: కుడి ఎడమైంది.. బెల్లంకొండ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది..
అప్పుడెప్పుడో అల్లుడు శీను సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లం కొండా శ్రీనివాస్. ఆ సినిమా తర్వాత చాలా కాలం తర్వాత రాక్షసుడు సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత యదా మాములే .. మళ్ళీ ఫ్లాపులు పలకరించాయి ఈయంగ్ హీరోను ..

Chatrapathi Hindhi Remake
అక్కినేని నాగేశ్వర రావ్.. దేవదాసు సినిమాలోని ‘కుడిఎడమైతే పొరపాటు లేదోయ్’ పాటలా మారింది ఇప్పుడు బెల్లంకొండ బాబు పరిస్థితి. బాలీవుడ్‌లో బిగ్ ఎంట్రీ ఇద్దామనుకున్న ఈ హీరో స్థితి. బొక్కబోర్లా పడడమే వైరల్ అవుతోంది బీటౌన్ లోకల్లీ..! అప్పుడెప్పుడో అల్లుడు శీను సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లం కొండా శ్రీనివాస్. ఆ సినిమా తర్వాత చాలా కాలం తర్వాత రాక్షసుడు సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత యదా మాములే .. మళ్ళీ ఫ్లాపులు పలకరించాయి ఈయంగ్ హీరోను ..
ఇదిలా ఉంటే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్లో.. బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ఫిల్మ్ ఛత్రపతి. ప్రభాస్ జక్కన్న కాంబో ఛత్రపతికి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా రిలీజ్ అయి బాలీవుడ్ బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లా పడింది. భారీ బడ్జెట్ తో.. హై ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో తెరెకెక్కిన ఈ సినిమా.. ప్రొడ్యూసర్లకు తీవ్ర నష్టాలను మిగిల్చిందనే టాక్ ఇప్పుడు బీ టౌన్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం అటు ఈసినిమా కోసం కానీ.. ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసం కానీ.. తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టారు. సినిమాలో యాక్షన్ తన ఎనర్జిటిక్ యాక్షన్ తో అందర్నీ ఆకట్టుకున్నారు. కానీ.. బాలీవుడ్ సినిమాలకు కానీ.. సౌత్ ఇండియన్ సినిమాలకు కానీ వచ్చేంత హైప్ ఈ స్ట్రెయిట్ హిందీ ఫిల్మ్ రాకపోవడంతో.. ఈసినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. నార్త్ జనాలను దూరం చేసింది.