BB Shining Stars,Kaushal Manda: బిగ్ బాస్ కౌశల్ మళ్లీ ఏసేశాడు.. తెలుగులోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా తానే తోపని స్పీచ్.. ఉలిక్కిపడ్డ బాబా భాస్కర్ – bigg boss telugu season 2 winner kaushal manda funny statement at bb shining stars
దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ కార్యక్రమంలో ఆటలు, పాటలు, స్కిట్లు ఇవన్నీ ఒక ఎత్తైతే బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ మందా మాట్లాడిన మాటలు మరో ఎత్తు అనేట్టుగా ఉంది. బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన కంటెస్టెంట్స్‌కి వివిధ పేర్లతో అవార్డులు ప్రకటించారు. ఈ అవార్డుల్ని భోళా శంకర్ (bhola shankar) దర్శకుడు మెహర్ రమేష్ చేతులపై అందించారు. బీబీ హౌస్‌లో సింపుల్‌గా జర్నీ స్టార్ట్ చేసి.. ట్రెండ్ సెట్టర్స్‌గా పేరుని సంపాదించుకున్న వాళ్లకి బీబీ ట్రెండ్ సెట్టర్ పేరుతో ముందు అవార్డ్‌లను ప్రకటించారు.
ఇందులో ముందుగా.. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ ఆడపులి.. బిందు మాధవికి బీబీ ట్రెండ్ సెట్టర్‌గా బిందు మాధవికి అవార్డ్ ఇచ్చారు. ఈ అవార్డ్ అందుకున్న బిందు మాధవి.. ‘బిగ్ బాస్‌లోకి వెళ్లడం ద్వారా అవకాశాలు వస్తాయనే లోపలికి వెళ్తాం.. నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి. నాపై నాకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు బిగ్ బాస్ నాకు మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది’ అని చెప్పింది బిందు మాధవి. ఇక సొహైల్‌కి కూడా ట్రెండ్ సెట్టర్ అవార్డ్ వచ్చింది. ఈ అవార్డ్ తీసుకున్న సొహైల్.. ‘బిగ్ బాస్ తరువాత నా లైఫ్ మారింది.. ఈరోజు హీరోగా మీ ముందు నిలబడ్డానంటే అది బిగ్ బాస్ వల్లే అని ఎమోషనల్ అయ్యాడు. ఈ తరువాత శ్రీహాన్‌కి కూడా బీబీ ట్రెండ్ సెట్టర్ అవార్డ్ ఇచ్చారు.
ఆ తరువాత బీబీ పవర్ స్టార్ అవార్డ్‌ని ప్రకటించగా.. ముందుగా సీజన్ 1 విజేత శివ బాలాజీకి బీబీ పవర్ స్టార్ అవార్డ్ ఇచ్చారు. ఈ అవార్డ్ అందుకున్న శివ బాలాజీ.. చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడారు. బిగ్ బాస్‌లో పరిస్థితుల్ని బట్టి మారాల్సి వస్తుంది కాబట్టి.. దాన్ని చూసి జడ్జ్ చేయడం మానేయాలని ఆడియన్స్‌కి రిక్వెస్ట్ చేశారు శివ బాలాజీ.
సింగర్ రేవంత్‌కి కూడా బీబీ పవర్ స్టార్ అవార్డ్ ఇచ్చారు. పవర్ స్టార్ సినిమాల్లో పాడటం ద్వారా పవర్ వచ్చింది.. అలాగే ఈ పవర్ స్టార్ అవార్డ్ రావడం ఆనందంగా ఉందని చెప్పారు సింగర్ రేవంత్.
ఈ తరువాత ఇదే అవార్డ్‌కి బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ మందా (Kaushal Manda)ని పిలిచారు. ఇతనికి బీబీ పవర్ స్టార్ అవార్డ్ అందించారు. ఇక మైక్ అందుకున్న కౌశల్ మైండ్ బ్లాక్ అయ్యే స్పీచ్ ఇచ్చాడు. ‘1984 నవల ఆధారంగా 1999లో ప్రారంభమైన బిగ్ బాస్ షో.. ప్రపంచ వ్యాప్తంగా 500 సీజన్‌లను పూర్తి చేసుకుంది. ఈ 500 సీజన్‌లలో బిగ్ బాస్ సీజన్ 2 రిమార్క్‌బుల్. ఆ సీజన్‌ని అంతలా ఆదరించిన ప్రేక్షకులకి.. ముందుండి నడిపించిన హోస్ట్ నాని గారికి.. కౌశల్ ఆర్మీకి ఎప్పుడూ రుణపడి ఉంటాను’ అంటూ స్పీచ్ ఇచ్చాడు కౌశల్ మందా.
తెలుగులో ఇప్పటివరకూ ఓటీటీతో కలిపి.. మొత్తం 7 సీజన్లు కంప్లీట్ చేసుకుంటే.. సీజన్ 6 పరమవరస్ట్ సీజన్‌గా మిగిలిపోయింది. మిగిలిన అన్ని సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. అన్ని సీజన్లలోనూ ది బెస్ట్ సీజన్ ఏంటంటే.. ఏ సీజన్‌కి ఆ సీజన్ ది బెస్ట్ అని చెప్తుంటారు బిగ్ బాస్ లవర్స్. ముఖ్యంగా ఎన్టీఆర్ హోస్ట్ చేసిన సీజన్ 1 అయితే ట్రెండ్ సెట్టర్. ఎన్టీఆర్ హోస్టింగ్ కానీ.. అందులోని కంటెస్టెంట్స్ కానీ.. కంటెస్టెంట్స్ ఎంపిక కానీ.. విన్నర్‌ని ప్రకటించిన తీరు కానీ.. ఎలిమినేషన్స్, నామినేషన్స్ అన్నీ ప్రజా నిర్ణయానికి అనుకూలంగా సాగిన జెన్యూన్ సీజన్ ఏదైనా ఉందంటే అది సీజన్ 1 అనేది చాలామంది చెప్పే మాట.
ఆ తరువాత రెండో సీజన్.. నాని హోస్టింగ్ చేశారు.. కౌశల్ విన్నర్ అయ్యారు. ఆ సీజన్ కూడా బాగా నడిచింది. నడవడం కాదు సూపర్ సక్సెస్ అయ్యింది. కౌశల్ ట్రెండ్ సెట్ చేశాడు. ఆ తరువాత సీజన్ వరుసగా నాగార్జున హోస్ట్ చేస్తూ వస్తున్నారు. మూడో సీజన్‌లో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ అయ్యారు.. నాలుగో సీజన్ అభిజిత్ విన్నర్ అయ్యారు.. ఐదో సీజన్ సన్నీ విన్నర్ అయ్యారు.. ఆరో సీజన్‌లో రేవంత్ విన్నర్ అయ్యారు.. వీటిలో ఒక్క ఆరో సీజన్ పరమ చెత్త సీజన్‌గా మిగిలిపోగా.. ఒకటో సీజన్ నుంచి ఐదో సీజన్ వరకూ అన్ని సీజన్లను ప్రేక్షకులు బాగానే ఆదరించారు. రేటింగ్స్ కూడా బాగా వచ్చాయి.
కానీ కౌశల్ మాత్రం.. తెలుగు సీజన్లే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 500 సీజన్లు పూర్తి చేసుకుంటే అందులో సీజన్ 2 గొప్పదని చెప్పడం పెద్ద జోక్‌గా మారింది. రేటింగ్ పరంగా చూస్తే.. సీజన్ 2 ఎంత రేటింగ్ వచ్చిందీ.. ఆ తరువాత వచ్చిన సీజన్లకు ఎంత రేటింగ్ వచ్చిందీ.. పోనీ రేటింగ్ పరంగా చూసుకున్నా మూడో సీజన్, నాలుగో సీజన్ ఐదో సీజన్‌లు రెండో సీజన్‌ని దాటేసింది. పోనీ పాపులారిటీ పరంగా చూస్తే.. కౌశల్‌తో పాటు.. అభిజిత్, సన్నీ, సిప్లిగంజ్‌లకూ మంచి క్రేజ్ ఏర్పడింది. అసలు విషయం ఏంటంటే.. కౌశల్ బిగ్ బాస్ విన్నర్‌ని అని అతను చెప్పుకోవడం తప్పితే.. తెలుగులో గుర్తుపెట్టుపొట్టుకోవడమే ఎక్కువ.
అలాంటిది ప్రపంచ వ్యాప్తంగా 500 సీజన్లు జరిగితే.. 500 మంది విన్నర్లు అయితే.. అందులో తానే తోపునని సెల్ఫ్ డబ్బా కొట్టుకుని పెద్ద షాకే ఇచ్చాడు కౌశల్. ఎప్పుడో 2018లో బిగ్ బాస్ సీజన్ 2 జరిగితే.. ఆ తరువాత ఐదు సీజన్లు వచ్చాయి. ఆరుగురు విన్నర్లు వచ్చారు. కానీ కౌశల్ చెప్పుకున్నంతగా అయితే ఎవరూ చెప్పుకోలేదు. విన్నర్‌లు అయిన వాళ్లంతా ఏదొక పని చేసుకుంటూ బిజీగా ఉన్నారు కానీ.. కౌశల్ మాత్రం.. ఇంకా తాను విన్నర్ అని చెప్పుకోవడం దగ్గరే ఆగిపోయాడు. అంతకు ముందు కనీసం సీరియల్స్‌లో అయినా కనిపించేవాడు కానీ.. బిగ్ బాస్ తరువాత అది కూడా లేదు. పోనీ సినిమాల్లో అయినా కనిపిస్తున్నాడంటే అదీ లేదు. ఇదిగో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు.. మళ్లీ బిగ్ బాస్ సీజన్‌లు ప్రారంభమైనప్పుడు ఏదొక బాంబ్ పేల్చి.. నేనున్నానని గుర్తు చేస్తూ ఉన్నాడు కౌశల్. ఒక్క మాట మాత్రం నిజం.. కౌశల్ విన్నర్ కావడం ప్రభంజనం.. ట్రెండ్ సెట్ చేశాడు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 500 మంది విన్నర్‌ల కంటే.. అన్ని సీజన్ల కంటే తానున్న సీజనే గొప్పని చెప్పుకోవడమే అతిగా ఉంది.