News

bariatric surgery, ఉస్మానియాలో 227 కిలోల బరువు ఉన్న వ్యక్తికి సర్జరీ.. 47 కిలోలు తగ్గించిన వైద్యులు ! – osmania doctors reduced the weight of a young man from 227 kgs to 180 kg through bariatric surgery


ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులు అరుదైన సర్జీరీ చేశారు. అధిక బరువుతో బాధపడుతున్న ఓ 23 ఏళ్ల యువకుడికి బేరియాట్రిక్ సర్జరీతో ఉపశమనం కలిగించారు. 227 కేజీల బరువున్న యువకుడికి శస్త్రచికిత్స చేసి 180 (47 కేజీలు తగ్గించారు) కేజీలకు తగ్గించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి సర్జరీ చేయటం రాష్ట్రంలో ఇదే తొలిసారని ఉస్మానియా డాక్టర్లు వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరంలోని గుడిమల్కాపూర్‌కు చెదిన మనీంద్ర సింగ్ అధిక బరవుతో బాధపడేవాడు. కేవలం 23 ఏళ్ల వయస్సులోనే అతడి బరువు 227 కేజీలకు చేరింది. గొత కొన్ని నెలలుగా అతడి బరువు వేగంగా పెరగటం మెదలైంది. తన పనులు కూడా తాను చేసుకోలేని స్థితికి మనీంద్ర చేరుకున్నాడు. దీంతో అతని తల్లిదండ్రులు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. సర్జరీకి రూ.8 నుంచి 10 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అంత ఆర్థిక స్థోమత లేని మనీంద్ర తండ్రి ఉస్మానియా ఆసుపత్రిలోని వైద్యులను సంప్రదించారు.

మనీంద్రను పరీక్షించిన ఉస్మానియా వైద్యులు.. అతడు డయాబెటిస్, అధిక రక్తపోటు, ఇతర శారీరక సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఉస్మానియాకు చెందిన సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఎండోక్రైనాలజీ, అనస్తీషియా విభాగాలకు చెందిన 15 మంది వైద్యులు బృందం మనీంద్రకు బేరియాట్రిక్‌ సర్జరీ చేయాలని నిర్ణయించారు. గ్యాస్ట్రిక్‌ బైపాస్‌ ద్వారా పొట్ట పరిమాణం తగ్గించడంతో పాటు, ఎక్కువ ఆహారం తీసుకోకుండా నియంత్రించేందుకు ఆహారాన్ని స్వీకరించే చిన్న పేగును కూడా వైద్యులు తగ్గించారు. ఆపరేషన్‌కు ముందు 227 కిలోల బరువుండే.. మనీంద్ర సర్జరీ తర్వాత 47 కేజీలు తగ్గి 180 కేజీలకు చేరుకున్నాడు.

అతడికి శస్త్ర చికిత్స చేసే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ తెలిపారు. అతడు అధిక బరువు ఉండటంతో ఆపరేషన్ టేబుల్‌పై పడుకోబెట్టడం కూడా కష్టంగా మారిందన్నారు. శరీరానికి రెండువైపులా మరో రెండు బల్లలు ఏర్పాటు చేసి సర్జరీ పూర్తి చేసినట్లు తెలిపారు. పొట్ట భాగాన్ని 70 శాతం తగ్గించామన్న ఆయన.. తిరిగి బరువు పెరగకుండా ఉండేందుకు చిన్న ప్రేగును తగ్గించామన్నారు. సర్జరీ చేసిన నాలుగు గంటల్లోనే మనీందర్ నడవగలిగాడని చెప్పారు. ఊబకాయం ఉన్న రోగులకు ఇంతకు ముందు రిడక్షన్ సర్జరీతో చికిత్స చేసేవారని., గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయడం రాష్ట్రంలో ఇదే తొలిసారి అని చెప్పారు.

  • Read More Telangana News And Telugu News

Related Articles

Back to top button