News

Banking News: ఈ నాలుగు బ్యాంకుల కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. డిపాజిట్లపై అధిక వడ్డీరేట్లు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వరుసగా రెపో రేటు పెంచిన తర్వాత బ్యాంకులు మే 2022 నుండి ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్..

Nov 01, 2022 | 9:58 AM

Subhash Goud

Subhash Goud |

Nov 01, 2022 | 9:58 AM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వరుసగా రెపో రేటు పెంచిన తర్వాత బ్యాంకులు మే 2022 నుండి ఫిక్స్‌డ్ డిపాజిట్లు,  సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు ఇటీవల టర్మ్ డిపాజిట్లపై వడ్డీని పెంచిన రుణదాతల్లో యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఆర్‌బీఎల్‌ బ్యాంకులు ఉన్నాయి. చిన్న ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్‌ఎఫ్‌బీ)లు కస్టమర్లకు లాభదాయకమైన రేట్లను అందిస్తాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఆర్‌బీఎల్‌  బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,  కెనరా బ్యాంక్ కొన్ని డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు 7% కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ తాజా ఎఫ్‌డీ రేట్లు: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు ఎఫ్‌డీని అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు ఈ డిపాజిట్లపై 50 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) అదనంగా పొందుతారు. 750 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం, బ్యాంక్ సాధారణ కస్టమర్‌లకు 7.25%,  సీనియర్ సిటిజన్‌లకు 7.75% అందిస్తుంది.

ఆర్‌బీఎల్‌ బ్యాంక్: ఆర్‌బీఎల్‌ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 15 నెలల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 7% వడ్డీని అందిస్తుంది. ఈ అవధిలో సీనియర్ సిటిజన్లకు 7.50% రేటు లభిస్తుంది.

యూనియన్‌ బ్యాంకు: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా ఫిక్స్‌డ్‌ రేట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబరు 17 నుండి అమలులోకి వచ్చేలా రూ. 2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీపై వడ్డీ రేట్లను పెంచింది ప్రభుత్వ బ్యాంకు . తాజా పెంపు తర్వాత, బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు మెచ్యూరిటీలతో కూడిన ఎఫ్‌డీలపై 3% నుండి 7% వరకు వడ్డీని అందిస్తుంది.

కెనరా బ్యాంక్: కెనరా బ్యాంక్ 666 రోజుల కాలవ్యవధి కోసం ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ ప్రకారం, రుణదాత తన సాధారణ కస్టమర్లకు 7% వడ్డీ రేటును అందిస్తోంది. అయితే సీనియర్ సిటిజన్లు ఈ డిపాజిట్లపై 7.5% పొందుతారు. కెనరా బ్యాంక్ అన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ప్రస్తుతం 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటును సాధారణ ప్రజలకు 3.25% నుండి 7.00%, సీనియర్ సిటిజన్‌లకు 3.25% నుండి 7.50% వరకు అందిస్తోంది. ఈ కొత్త రేట్లు 7 అక్టోబర్ 2022 నుండి అమలులోకి వచ్చాయి.

Advertisement

Most Read Stories

Related Articles

Back to top button