News

Bank Scam,Bank Fraud: మరో అతిపెద్ద బ్యాంక్ స్కాం.. ఏకంగా వేల కోట్లు ముంచేసిన కంపెనీ.. ఎలా జరిగిందంటే? – cbi files case against infra firm in rs 3,847 crore bank fraud case


Bank Frauds in India: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియాన్ని ఒక కంపెనీ వేల కోట్లకు ముంచేసింది. ఇది తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి.. ముంబైకి చెందిన ఒక డెవలపర్ యూనిటీ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ లిమిటెడ్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కేసు నమోదు చేసింది. కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (CMD) కిషోర్ కృష్ణ అవర్‌సేకర్, ప్రమోటర్స్ అభిజిత్ కిషోర్ అవర్‌సేకర్, ఆశిష్ అవర్‌సేకర్ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌) లపై అభియోగాలు మోపింది.

ఇంకా ముగ్గురు డైరెక్టర్లు, కొందరు గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పలువురు అధికారులపైనా సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. ఎస్‌బీఐ సహా ఇతర 15 బ్యాంకుల కన్సార్టియంను రూ. 3,847.58 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై CBI .. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ముంబైలోని స్ట్రెస్డ్ అసెట్స్ మేనేజ్‌మెంట్ బ్రాంచ్, SBI డిప్యూటీ జనరల్ మేనేజర్ దాఖలు చేసిన కంప్లైంట్ ఆధారంగా గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

  • SBI మొన్న ఆఫర్ ఇచ్చింది.. ఇప్పుడిలా రివర్స్ గేర్.. అమల్లోకి కొత్త వడ్డీ రేట్లు.. నేటి నుంచే అమల్లోకి..

PM Kisan Scheme: రైతులకు అద్భుత ఆఫర్.. కేంద్రం పండగ బొనాంజా.. ఈసారి ముందే అకౌంట్లలోకి డబ్బులు

ముంబైలోని తమ కమర్షియల్ బ్రాంచ్‌లో మోసం జరిగిందని.. నిందితులు ఫేక్ ట్రాన్సాక్షన్లు చేయడం, బ్యాంకును మోసం చేయడం, చట్టవిరుద్ధంగా, మోసపూరితంగా అకౌంట్ పుస్తకాలను తారుమారు చేసి బ్యాంక్ నిధుల్ని స్వాహా చేశారని ఈ కేసులో .. 2023, ఆగస్ట్ 17న ఎస్‌బీఐ డీజీఎం (ముంబై) రజనీకాంత్ ఠాకుర్, యూనిటీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, దాని డైరెక్టర్స్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

మొత్తంగా 23 బ్యాంకులు ఉన్నప్పటికీ కేవలం 16 బ్యాంకులు మాత్రమే తమ అంచనా నష్టాలు నివేదించాయి. దీంట్లో బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధానంగా ఉన్నాయి. 2012లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ తర్వాత.. మంత్రాలయ భవనం పునరుద్ధరణ, కళానగర్‌లో ఠాక్రే కుటుంబ బంగ్లా మాతోశ్రీ నిర్మాణం, దాదార్ టీటీ ఫ్లై ఓవర్, CSM సబ్‌వే వంటి నిర్మాణాలకు యూనిటీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ పాపులర్‌ అయింది.

అదిరిపోయే న్యూస్.. ఐపీఓకు రూ. 11 లక్షల కోట్ల విలువైన టాటా కంపెనీ.. ఆర్‌బీఐ హెచ్చరిక!

పండగల వేళ సూపర్ ఆఫర్.. కేవలం 8.45 శాతం వడ్డీకే హోం లోన్.. లక్షకు ఎంత EMI కట్టాలంటే?

Read Latest Business News and Telugu News

Advertisement

Related Articles

Back to top button