News

bank of baroda, FD Rates: గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. డబ్బులుంటే అధిక వడ్డీ.. 30 బేసిస్ పాయింట్లు పెంపు! – bank of baroda hikes fixed deposit retail term deposit rates by 30 bps on select tenure


FD Rates: బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు గుడ్‌న్యూస్. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 30 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. సీనియర్ సిటిజన్లకు ఈ బ్యాంకులో గరిష్ఠంగా 7.75 శాతం వరకు వడ్డీ రేటును పొందవచ్చు. ఎన్‌ఆర్‌ఓ, ఎన్ఆర్ఈ టర్మ్ డిపాజిట్లకు సైతం పెంచిన వడ్డీ రేట్లు వర్తిస్తాయని బ్యాంక్ తెలిపింది. అలాగే 399 రోజుల టెన్యూర్ కలిగిన బరోడా తిరంగా ప్లస్ డిపాజిట్ స్కీమ్ వడ్డీ రేట్లను పెంచింది. సవరించిన వడ్డీ రేట్లు మే 12 నుంచే అమలులోకి వచ్చినట్లు బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 7 రోజుల నుంచి 14 రోజుల కనీస డిపాజిట్లపై సాధారణ డిపాజిటర్లు 3 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లు 3.50 శాతం వడ్డీని పొందవచ్చు. ఒక ఏడాది డిపాజిట్లపై సాధారణ డిపాజిటర్లు 6.75 శాతం వడ్డీ అందుకోనుండగా.. ఇదే డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం వడ్డీ లభిస్తుంది.రూ.2 కోట్లు లోపు ఉన్న రిటైల్ టర్మ్ డిపాజిట్లకు ప్రస్తుతం 6.75 శాతం వడ్డీ ఉండగా మే 12 నుంచి 7.05 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది. ఇది 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల టెన్యూర్ మధ్య ఉన్న వాటికి వర్తిస్తాయి. ఆయా టెన్యూర్లపై 7.55 శాతం పెంచింది. మరోవైపు.. 399 రోజుల బరోడా తిరంగా ప్లస్ స్పెషల్ రూ.2 కోట్ల డిపాజిట్లపై జనరల్ కేటగిరీ 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ ఇస్తోంది. గతంలో ఈ రేట్లు జనరల్ కేటగిరీ 7.05 శాతం, సీనియర్లకు 7.55 శాతం వడ్డీ అందిస్తోంది.

399 రోజుల బరోడా తిరంగా ప్లస్ డిపాజిట్ స్కీమ్ ద్వారా ప్రస్తుత వార్షిక వడ్డీ 7.90 శాతం అందిస్తోంది. సీనియర్లకు అదనంగా 0.50 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. అలాగే సీనియర్లకు నాన్ కాలబుల్ డిపాజిట్లపై అదనంగా 0.15 శాతం వడ్డీ అందిస్తోంది. బరోడా అడ్వాంటేజ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.15.01 లక్షల నుంచి రూ.2 కోట్ల లోపు ఉన్న వాటికి వడ్డీ రేటు జనరల్ కేటగిరీ 7.30 శాతం అందిస్తోంది. సీనియర్లకు 7.80 శాతం వడ్డీ రేట్లు అందిస్తోంది. బరోడా తిరంగా ప్లస్ స్కీమ్ 399 రోజుల టెన్యూర్‌పై జనరల్ కేటగిరీకి 7.40 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.90 శాతం వడ్డీ రేట్లు కల్పిస్తోంది. గతంలో ఇది వరుసగా 7.80 శాతం 7.40 శాతంగా ఉండేది.

తగ్గిన బంగారం, వెండి ధరలు

  • Read Latest Business News and Telugu News

FD rates: బ్యాంక్ కీలక ప్రకటన.. కస్టమర్లకు అదిరే గుడ్‌న్యూస్.. డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు!Unity SFB: ఇలా చేస్తే మీ డబ్బులకు ఎక్కువ వడ్డీ.. బీమా కవరేజీతో భద్రం.. రిస్క్ లేని పెట్టుబడి!ఈ బ్యాంక్‌లో Savings Account ఉంటే చాలు.. మీ డబ్బులకు అధిక రాబడి.. ఎఫ్‌డీతో సమానంగా వడ్డీ!

Related Articles

Back to top button