News
bandi sanjay on rapes, ‘తెలంగాణలో పూటకో హత్య, గంటకో రేప్.. రేపిస్టులంతా బీఆర్ఎస్‌లోనే..’ – bjp state president bandi sanjay comments on rapes in telangana
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా.. సోమవారం రోజు హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చేపట్టిన ఒక్క రోజు దీక్షలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రీతి కేసును నీరుగార్చి నిందితుడు సైఫ్‌ను హీరోను చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికిది ప్రతీ కాదని.. తన తల్లిదండ్రులు చెప్తున్నారని.. ఇది ముమ్మాటికి హత్యేనని బండి సంజయ్ ఆరోపించారు. ప్రీతి డెడ్‌బాడీకీ నాలుగు రోజుల పాటు ట్రీట్‌మెంట్ ఇచ్చి.. ఠాగూర్ సినిమా సీన్‌ను రిపీట్ చేశారని ఆక్షేపించారు. ప్రీతి ఫోన్‌ను ఓపెన్ చేసి వాట్సాప్ చాటింగ్ అంతా పోలీసులు డిలీట్ చేశారని బండి సంజయ్ ఆరోపించారు.
బీజేపీ అధికారంలోకి వస్తే జీరో టాలరెన్స్ విధానాన్ని తీసుకురానున్నట్టు తెలిపారు బండి సంజయ్. ఉత్తర ప్రదేశ్ తరహాలో మహిళల మీద అఘాయిత్యాలు చేసే వారి ఇళ్లను బుల్డొజర్లు పెట్టి కూల్చేస్తామంటూ చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ది కేవలం కోతల ప్రభుత్వమేనని.. చేతలు మాత్రం ఏమీ ఉండవంటూ విమర్శించారు. కేసీఆర్‌ను సీఎం పదవి నుంచి పీకేసే రోజులు దగ్గర పడ్డాయన్నారు బండి సంజయ్.
- Read More Telangana News And Telugu News