Entertainment

The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ చూసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. సినిమాపై ఏమని స్పందించారంటే..?


The Kerala Story: దేశంలో కొందరు.. మతం పేరుతో కుట్రలు చేస్తున్నారని, ‘ది కేరళ స్టోరి’ సినిమాపై కూడా ఇదే జరుగుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ నారాయణగూడలో బీజేపీ నాయకులు, అభిమానులతో కలిసి మంత్రి “ది కేరళ స్టోరీ” చిత్రాన్ని..

The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ చూసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. సినిమాపై ఏమని స్పందించారంటే..?

Kishan Reddy On The Kerala Story

The Kerala Storyదేశంలో కొందరు.. మతం పేరుతో కుట్రలు చేస్తున్నారని, ‘ది కేరళ స్టోరి’ సినిమాపై కూడా ఇదే జరుగుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ నారాయణగూడలో బీజేపీ నాయకులు, అభిమానులతో కలిసి మంగళవారం రాత్రి మంత్రి “ది కేరళ స్టోరీ” చిత్రాన్ని వీక్షించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. కేరళ స్టోరీపై ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు చూసి.. సినిమా చూడాలి అనుకున్నానని చెప్పారు. వాస్తవానికి అనుగుణంగా సినిమా తీసినట్లు దేశ ప్రజలు భావిస్తున్నారన్నారు.

ఇంకా ఒక మతానికి సంబంధించిన వారిని కుట్రలు, కుతంత్రాలతో, లవ్ జిహాద్ పేరుతో మత మార్పిడులు చేయిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి ఘటనలను యావత్ సమాజం ఖండించాలని పిలుపునిచ్చారు. ఐసిస్ తీవ్రవాదులు ముస్లిం మహిళలను కూడా ఏ విధంగా హింసించారో చూశామన్నారు. ఆడబిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు కిషన్ రెడ్డి. మహిళలను ఐసిస్‌ ఉగ్రవాదులు ఏ విధంగా హింసించారో చూశామని, మహిళలను మత మార్పిడులు చేయిస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button