Entertainment

Balakrishna: యంగ్‌ ఎట్‌ హార్ట్.. ఈ కొత్త కాంబినేషన్ గురించి తెలిస్తే బాలయ్య ఫాన్స్‌కు పూనకాలే..


బాలయ్య దూకుడు మామూలుగా లేదు. ఓటీటీల్లోనే కాదు, సిల్వర్‌ స్క్రీన్‌ మీద కూడా అన్‌స్టాపబుల్‌ అంటున్నారు. సీనియర్లంటే నాకు రెస్పెక్ట్ ఉందని చెబుతూనే, కొత్తవాళ్లతో కమిట్‌ అవుతూ యంగ్‌ అట్‌ హార్ట్ అని ప్రూవ్‌ చేసుకుంటున్నారు.

Nandamuri Balakrishna: బాలయ్య దూకుడు మామూలుగా లేదు. ఓటీటీల్లోనే కాదు, సిల్వర్‌ స్క్రీన్‌ మీద కూడా అన్‌స్టాపబుల్‌ అంటున్నారు. సీనియర్లంటే నాకు రెస్పెక్ట్ ఉందని చెబుతూనే, కొత్తవాళ్లతో కమిట్‌ అవుతూ యంగ్‌ అట్‌ హార్ట్ అని ప్రూవ్‌ చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా బాలయ్య గురించి మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ వైరల్‌ అవుతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడే తెలుసుకోండి..

సంక్రాంతికి వీరసింహారెడ్డిగా ప్రేక్షకులను పలకరించారు నందమూరి బాలకృష్ణ. ఆ సినిమాలో ఆయన డ్యూయల్‌ యాక్షన్‌కి మరో సారి జనాలు ఫిదా అయ్యారు. సేమ్‌ సీజన్‌లో వాల్తేరు వీరయ్యతో హిట్‌ డైరక్టర్‌‌గా బాబీ క్రెడిట్‌ అందుకున్నారు. వాల్తేరు వీరయ్యలోనే కాదు, గతంలో చేసిన చిత్రాల్లోనూ మాస్‌ ప్లస్‌ సెంటిమెంట్‌ని పర్ఫెక్ట్ గా బ్లెండ్‌ చేస్తారనే పేరు బాబీ సొంతం. ఇప్పుడు ఆయన నందమూరి బాలయ్యకు ఓ కథ నెరేట్‌ చేశారని, బాలయ్య నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిందని, మూవీ త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉందనీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరక్షన్‌లో సినిమా చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. నెవర్‌ బిఫోర్‌ కాన్సెప్ట్ తో బాలయ్య మూవీ చేస్తున్నట్టు న్యూస్‌ వైరల్‌ అవుతోంది. అనిల్‌ రావిపూడికి బాలయ్యంటే ప్రత్యేక అభిమానం. ఆ అభిమానంతోనే కల్యాణ్‌రామ్‌ మూవీలోనూ బాలయ్య సాంగ్‌ రీమిక్స్ చేశారు అనిల్‌.

ఇవి కూడా చదవండి



రీసెంట్‌గా వీరసింహారెడ్డి చేసిన గోపీచంద్‌ మలినేని కూడా బాలయ్యకు ఫ్యాన్‌. ఇప్పుడు సెట్స్ మీదున్న అనిల్‌ రావిపూడి, నెక్స్ట్ మూవీ చేస్తారంటున్న బాబీ కూడా అదే కోవలోకి వస్తారు. తన సినిమాలు చూస్తూ పెరిగిన యువ దర్శకులతో కంటిన్యూగా సినిమాలు చేస్తూ యంగ్‌ ఎట్‌ హార్ట్ అనిపించుకుంటున్నారు పైసా వసూల్‌ హీరో.

మరిన్ని సినిమా వార్తలు చదవండి..

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button