Entertainment

Balakrishna: ‘భయం నా బయోడేటాలోనే లేదురా .. మాస్ డైలాగ్ తో అదరగొట్టిన బాలయ్య మనవడు.. సంబరపడిపోతోన్న ఫ్యాన్స్..


అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకు వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే జనవరి 6న ఒంగోలులో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. అయితే ఈ వేడుకలో బాలయ్య మనవడు ఆర్య వీర్ కు సంబంధించిన వీడియోను ప్లే చేసిన సంగతి తెలిసిందే.

Balakrishna: 'భయం నా బయోడేటాలోనే లేదురా' .. మాస్ డైలాగ్ తో అదరగొట్టిన బాలయ్య మనవడు.. సంబరపడిపోతోన్న ఫ్యాన్స్..

Balakrishna Grand Son Aryav

మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని రూపొందిస్తోన్న లేటేస్ట్ చిత్రం వీరసింహా రెడ్డి. ఇందులో నందమూరి నటసింహం బాలకృష్ణ, శ్రుతి హాసన్ జంటగా నటిస్తుండగా..మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీలో దునియా విజయ్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచగా..,మరోవైపు సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే జనవరి 6న ఒంగోలులో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. అయితే ఈ వేడుకలో బాలయ్య మనవడు ఆర్య వీర్ కు సంబంధించిన వీడియోను ప్లే చేసిన సంగతి తెలిసిందే.

ఆ వీడియోలో బాలయ్య మనవడు.. తేజస్విని కుమారుడు ఆర్యవీర్ పవర్ ఫుల్ డైలాగ్ తో అదరగొట్టాడు. ఈ సినిమాలోని “భయం నా బయోడేటాలో లేదురా” అనే డైలాగ్ ను రీక్రియేట్ చేశాడు. యాక్షన్ అంటూ తాతయ్య చెప్పగానే.. నాన్ స్టాప్ గా డైలాగ్ చెప్పి సూపర్ అనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను వీరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ వేడుకలో ప్రసారం చేయగా.. దీనిని చూసి బాలయ్యతోపాటు.. ఫ్యాన్స్ కూడా సంతోషపడిపోయారు.

ఇక బాలయ్య మనవడు ఆర్యవీర్ చెప్పిన ఈ డైలాగ్ వీడియో యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతుంది. తమ అభిమాన హీరో మనవడు నాన్ స్టాప్ గా పవర్ ఫుల్ డైలాగ్ చెప్పడం చూసి సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్ .



మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisement

ఇవి కూడా చదవండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button