Balakrishna: వీరసింహారెడ్డి ఈవెంట్లో బాలయ్య చేతికున్న వాచ్ ధర ఎంతో తెలుసా? దీనికి ఓ హిస్టరీ కూడా ఉందండోయ్..
వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలయ్య ధరించిన బ్లాక్ కలర్ స్ట్రిప్ ఉన్న వాచ్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. దీని హిస్టరీ, బ్రాండ్, కంపెనీ, ధర.. తదితర విషయాలను సెర్చ్ చేయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి. గోపిచంద్ మలినేని తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ మాస్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఆఖండ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత బాలయ్య నుంచి వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఇప్పటివరకు రిలీజైన వీరసింహారెడ్డి పాటలు, టీజర్లు, ట్రైలర్లు సూపర్ హిట్ అయ్యాయి. కాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఒంగోలు వేదికగా వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకగా నిర్వహించారు. బాలయ్య, శ్రుతిహాసన్, హానిరోజ్, వరలక్ష్మీ శరత్‌కుమార్ తదితర చిత్రబృందమంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక ఈవెంట్ మొదలు ముగిసే వరకు జై బాలయ్య.. జై జై బాలయ్య అన్న నినాదాలతో వేదిక దద్దరిల్లిపోయింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గోల్డెన్ కలర్ బ్లేజర్‌తో ట్రెండింగ్ లుక్‌లో కనిపించారు బాలయ్య. అదే సమయంలో మన సంస్కృతిని ప్రతిబింబించేలా ధోతిలోనూ హుందాగా దర్శనమిచ్చారు. ఇవి బాలయ్య అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలయ్య ధరించిన బ్లాక్ కలర్ స్ట్రిప్ ఉన్న వాచ్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. దీని హిస్టరీ, బ్రాండ్, కంపెనీ, ధర.. తదితర విషయాలను సెర్చ్ చేయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బాలయ్య ధరించిన వాచ్ ఫేమస్ బ్రాండ్ అయిన కార్టియర్‌కు చెందింది. ఈవాచ్ ధర సుమారు రూ.24,58,987 అని అధికారిక వెబ్సైట్లో ఉంది. ‘కార్డియర్ సాంటోస్ 100 స్కెలెటన్’ పేరుతో ఉన్న ఈ వాచ్‌ని కూతురు బ్రాహ్మణి బాలయ్యకు గిఫ్ట్‌గా ఇచ్చారట. ఈ వాచ్ అంటే బాలయ్యకు ఎంతో ఇష్టమట. ప్రత్యేక సందర్భాలలో మాత్రమే దానిని ధరిస్తారట.కార్టియర్ వాచ్ సంస్థను 1847లో పారిస్ లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఎప్పటికప్పుడు యునిక్ డిజైన్లతో ఈ సంస్థ వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తోంది. కాగా ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇంత ధరనా? అంటూ ముక్కునవేలేసుకుంటున్నారు. కాగా అన్నిహంగులు పూర్తి చేసుకున్న వీరసింహారెడ్డి మరో రెండు రోజుల్లో థియేటర్లలో అడుగుపెడుతున్నాడు. శ్రుతిహాసన్ మెయిన్ హీరోయిన్గా నటిస్తుండగా దునియా విజయ్ విలన్‌గా నటిస్తున్నాడు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

Cartier Watch
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..