Balakrishna Birthday: బాలయ్యకు మాత్రమే ఉన్న ఏకైక రికార్డ్.. 100కు పైగా సినిమాలు..
తెరమీద తెర వెనక శ్లోకాలు, పద్యాలను అవలీలగా చెప్పగలిగే అరుదైన తెలుగు నటుల్లో బాలయ్య ఒకరు. ప్రస్తుతం ఉన్న నటుల్లో పౌరాణిక, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్.. ఇలా అన్ని జానర్లను టచ్ చేసిన అగ్రకథానాయకుడాయనే. ఈరోజు (జూన్ 10) బాలకృష్ణ పుట్టినరోజు.
తెలుగు సినీపరిశ్రమలో మాస్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ నందమూరి నటసింహం బాలకృష్ణ. ఆయన తొడగిడితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఎన్టీఆర్ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తొలి సినిమాకే నటనకు ప్రశంసలు అందుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఓవైపు అగ్రకథానాయకుడిగా కొనసాగుతూనే.. మరోవైపు రాజకీయ నాయకుడిగా ప్రజలకు సేవ చేస్తున్నారు హీరో బాలకృష్ణ. పైసా వసూల్, సాహసమే జీవితం, సింహా, నిప్పులాంటి మనిషి చిత్రాలు ఆయన కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయేవి. ఇక ఆయన చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. తెరమీద తెర వెనక శ్లోకాలు, పద్యాలను అవలీలగా చెప్పగలిగే అరుదైన తెలుగు నటుల్లో బాలయ్య ఒకరు. ప్రస్తుతం ఉన్న నటుల్లో పౌరాణిక, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్.. ఇలా అన్ని జానర్లను టచ్ చేసిన అగ్రకథానాయకుడాయనే. ఈరోజు (జూన్ 10) బాలకృష్ణ పుట్టినరోజు.
తాతమ్మ కల సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు బాలకృష్ణ. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా తొలి చిత్రానికే నటనకు ప్రశంసలు అందుకున్నాదు. దాదాపు వందకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. చెంఘీజ్ ఖాన్, గోన గన్నారెడ్డి పాత్రలో నటించాలనేది ఆయన చిరకాల కోరిక. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి చిత్రంలో నటిస్తున్నారు. ఇక ఇన్నేళ్ల సుధీర్ఘ ప్రస్థానంలో ఇప్పటివరకు ఒక్క రీమేక్ చిత్రంలో నటించలేదు. ఆ ఘనత ఆయనకే సొంతం.
అలాగే అత్యధిక చిత్రాల్లో ద్విపాత్రాభినయం పోషించిన హీరోగా బాలయ్యకు మాత్రమే రికార్డ్ ఉంది. దాదాపు ఆయన 17 సినిమాల్లో డ్యూయల్ రోల్ ప్లే చేశారు. అదినాయకుడు సినిమాలో త్రిపాత్రాభినయంలో కనిపించారు. అంతేకాకుండా 43వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకకు టాలీవుడ్ తరపున అతిథి హోదాలో వెళ్లిన నటుడాయనే. అలాగే 1987లో బాలయ్య సినిమాలు 8 విడుదలవడం ఓ విశేషమైతే.. అవన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టడం మరో విశేషం. ఇక కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అత్యధికంగా 13 చిత్రాల్లో నటించిన హిస్టరీ ఆయనకే సొంతం. అలాగే తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి దాదాపు 10కి పైగా సినిమాల్లో నటించారు.