Balakrishna: ‘బాలకృష్ణ సినిమాలు.. రాజకీయాలకే పరిమితం అనుకునేవారికి అదే సమాధానం’.. స్పీచ్‌తో అదరగొట్టిన బాలయ్య.. | Balakrishna Speech In Veera Simha Reddy Pre Release Event In Ongole telugu cinema news
వీరసింహారెడ్డి ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఒంగోలులోని అర్జున్ ఇన్ ఫ్రా మైదానంలో ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 6న నిర్వహించిన సంగతి తెలిసిందే ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా బాలయ్య తన స్పీచ్‌తో ఆకట్టుకున్నారు.
నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్లో రాబోతున్న చిత్రం వీరసింహా రెడ్డి. ఈ సినిమాలో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తుండగా.. దునియా విజయ్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మాసివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఒంగోలులోని అర్జున్ ఇన్ ఫ్రా మైదానంలో ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 6న నిర్వహించిన సంగతి తెలిసిందే ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా బాలయ్య తన స్పీచ్‌తో ఆకట్టుకున్నారు. ఎన్నో రకాల సినిమాలు చేసినా నాకు ఇంకా కసి తీరలేదు.. భిన్నమైన పాత్రలు పోషించడం.. బాధ్యతలు నిర్వహించడంలోనే తృప్తి ఉందని చెప్పకొచ్చారు.
బాలకృష్ణ మాట్లాడుతూ.. “నాకు జన్మనిచ్చి.. మీ అందరి గుండెల్లో నిలిపినందుకు నా తండ్రి ఎన్టీఆర్ కు ధన్యవాదాలు. నటనలో ఆయన ప్రయోగాల దిట్ట. అలాంటి నటుడు మరొకరు లేరన్న విషయాన్ని నేనే కాదు ప్రతి నటుడూ అంగీకరించక తప్పదు. ఆయన సినిమాలతో కళామ తల్లి పండుగ చేసుకుంది. ఈ వేడుకతో ఈరోజు నుంచే సంక్రాంతి సందడి మొదలైంది. ఇక్కడికి వచ్చినప్రతి ఒక్కరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానను. ఈ వేడకకు అందాన్ని.. పెద్దరికాన్ని తీసుకొచ్చేది దర్శకుడు బి.గోపాల్ గారనే అనుకున్న ఆయన్ను ఆహ్వానించాం. నటులు.. టెక్నిషియన్ల నుంచి ప్రతిభను వెలికితీయగల సత్తా ఉన్న ఒంగోలు గిత్త మన గోపీచంద్ మలినేని. ఇతను మాత్రమే కాదు.. నా రాబోయే చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి సైతం ఒంగోలే. నేనెప్పుడూ రాయలసీమకే పరిమితమవుతానని అనుకుంటారు. కానీ అది నిజం కాదు.. మానవారణ్యంలో కల్మషం, కుతంత్రాలను వేటాడే సింహరాజు నేనే. రెడ్డిని నేనే. నాయుడిని నేనే. అన్ని కులాలు ఆదరించే మీ బాలకృష్ణని.
బాలకృష్ణ సినిమాలు.. రాజకీయాలకే పరిమితం అనుకుంటారు. కానీ అలాంటివారికి అసలైన సమాధానం అన్ స్టాపబుల్ కార్యక్రం. టాక్ షోలలో అది నెంబర్ 1గా నిలిచింది. అలాగే.. చరిత్రలలో శాశ్వతంగా నిలిచిపోయే చిత్రాల్లో వీరసింహా రెడ్డి ఒకటి. నటీనటులు, సాంకేతిక నిపుణులు కష్టపడి పనిచేశారు. ఇప్పటివరకు ఎన్నో రకాల సినిమాలు చేసినా నాకు ఇంకా కసి తీరలేదు. భిన్నమైన పాత్రలు పోషించడం.. బాధ్యతలు నిర్వహించడంలోనే తృప్తి ఉంటుంది. అలాగే నేను ఇంకా సప్తగిరి నుంచి మంచి కామెడీ టైమింగ్ నేర్చుకోవాలి. ” అంటూ చెప్పుకొచ్చారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.