Balakrishna: ఎలక్షన్ టార్గెట్‌గా బాలయ్య – బోయపాటి మూవీ.. పొలిటికల్ లీడర్‌గా నందమూరి హీరో..! – Telugu News | Interesting buzz on next Balakrishna Boyapati combo movie story Tollywood Latest News
Balayya – Boyapati Movie: ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ… నెక్ట్స్ బ్లాక్ బస్టర్ కాంబోను రిపీట్ చేయబోతున్నారు. అది కూడా కమర్షియల్ ఫార్మాట్‌కు దూరంగా వచ్చే ఎలక్షన్ టార్గెట్‌గా సినిమాను ప్లాన్ చేస్తున్నారన్నది ఫిలిం నగర్ టాక్.
Balayya – Boyapati Movie: ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ… నెక్ట్స్ బ్లాక్ బస్టర్ కాంబోను రిపీట్ చేయబోతున్నారు. అది కూడా కమర్షియల్ ఫార్మాట్‌కు దూరంగా వచ్చే ఎలక్షన్ టార్గెట్‌గా సినిమాను ప్లాన్ చేస్తున్నారన్నది ఫిలిం నగర్ టాక్. తాజాగా ఈ సినిమా విషయంలో మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాను రెగ్యులర్ బాలయ్య మార్క్ ఎంటర్‌టైనర్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఆ తరువాత చేయబోయే సినిమాలో మాత్రం కాస్త డిఫరెంట్‌గా ట్రై చేస్తారన్న టాక్ చాలా కాలంగా వినిపిస్తోంది. బ్లాక్ బస్టర్ కాంబో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను ఎలక్షన్ టార్గెట్‌గా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా బాలయ్య నెక్ట్స్ మూవీకి సంబంధించి మరో న్యూస్ ట్రెండ్ అవుతోంది. బాలయ్య, బోయపాటి కాంబోలో రాబోయే నెక్ట్స్ మూవీ లెజెండ్ సీక్వెల్ అన్న ప్రచారం జరుగుతోంది. గతంలో లెజెండ్ సినిమాలో బాలయ్యను పొలిటీషియన్‌గా చూపించిన బోయపాటి మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారన్నది ఫిలిం నగర్ టాక్.
బాలయ్య పొలిటికల్ ఇమేజ్‌కు ఉపయోగపడేలా నెక్ట్స్ మూవీని ప్లాన్ చేస్తున్నారు బోయపాటి. అందుకే ఈ కథలో హీరోయిన్, సాంగ్స్ లాంటివి పెడితే సోల్ దెబ్బ తింటుదన్న ఉద్దేశంతో మసాలా ఎలిమెంట్స్ లేకుండానే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. అదే సమయంలో బాలయ్య మార్క్ పంచ్ డైలాగ్స్ మాస్ ఎలివేషన్స్ మిస్ అవ్వకుండా చూసుకుంటున్నారు.
లెజెండ్ క్లైమాక్స్‌లో పొలిటికల్ పంచ్‌లతో అదరగొట్టిన బాలయ్య, ఇప్పుడు ఫుల్ లెంగ్త్ పొలిటికల్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తుండటంతో ఫిలిం సర్కిల్స్‌లోనే కాదు పొలిటికల్ సర్కిల్స్‌లోనూ ఈ సినిమా గురించి గట్టిగానే చర్చ జరుగుతోంది.
-సతీష్ రెడ్డి, టీవీ9 తెలుగు(ET Team)
మరిన్ని సినిమా వార్తలు చదవండి..