News
balagam climax scene, Karimnagar: ‘బలగం’ సినిమా సీన్ రిపీట్.. అక్కడ ఫ్యామిలీ ఫొటో.. ఇక్కడ మాత్రం వెరైటీగా..! – balagam movie scene repeat in jammikunta, playing cards in plate on 5th day
తెలంగాణ రాష్ట్రమంతా బలగం సినిమాకు ఎంతగా కనెక్టయ్యిందంటే.. ఆ సినిమా చూసి ఏళ్ల కింద విడిపోయిన అన్నదమ్ములు, అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెల్లు.. ఇలా చాలా మంది కలిసిపోయారు. అంతే కాదు.. ఆ సినిమా క్లైమాక్స్‌లో జరిగిన సన్నివేశాలే ఇప్పుడు గ్రామాల్లో రిపీటవుతున్నాయి కూడా. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో అదే జరిగింది. అయితే.. గ్రామానికి చెందిన పూదరి వెంకటరాజం గౌడ్(80) అనే వృద్ధుడు ఐదు రోజుల క్రితం చనిపోయాడు. వెంకటరాజంకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. అయితే.. ఈ వెంకటరాజం గౌడ్.. తమ ఊరికి చుట్టూ ఉన్న ఏడు గ్రామాలకు గ్రామ పెద్దగా గతం 50 ఏళ్లుగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. వెంకటరాజాం చనిపోయి 5 రోజులవుతుండటంతో.. కుటుంబసభ్యులు ఆయనకు ఇష్టమైన ఆహార పదార్థాలన్ని తయారు చేసి పిట్టకు పెట్టారు.
అయితే.. బలగం సినిమాలో చూపెట్టినట్టే.. ఆ నైవేద్యాన్ని ఒక్క పిట్ట కూడా వచ్చి ముట్టలేదు. సినిమాలో మాదిరిగానే రకరకాల ప్రయత్నాలు చేశారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోయింది. వెంకటరాజంకు ఇష్టమైన వాళ్లంతా వచ్చారా లేదా అని ఆరా తీశారు. ఇంకేమైనా మర్చిపోయామా.. అంటూ చెక్ చేసుకున్నారు. ఇలా.. అన్ని రకాలుగా ఒకటికి రెండు సార్లు గుర్తు చేసుకున్నా.. అన్ని కరెక్టుగానే ఉన్నాయి. దీంతో కుటుంబ సభ్యులు ఒక ఆలోచనకు వచ్చారు. వెంకటరాజంకు చిన్నతనంలో పేకాట అంటే చాలా ఇష్టమట.. కుర్రాడిగా ఉన్నప్పుడు పేకాట ఎక్కువ ఆడేవాడట.

ఈ విషయం గుర్తుకొచ్చి.. ఒక ప్లేట్లో పేక ముక్కల కట్టను.. వాటితో పాటు 10 రూపాయల నోటును తీసుకొచ్చి పెట్టారు. అది పెట్టిన తర్వాత కూడా ఎంత సేపు చూసినా.. ఒక్క పిట్ట కూడా భోజనాన్ని ముట్టేందుకు రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు నిరాశ పడారు. తన తండ్రికి ఇష్టమైన ఆహార పదార్థాలతో పాటు.. ఆయనకు ఇష్టమైన పేక ముక్కలు పెట్టడం వల్ల తన తండ్రి ఆత్మ శాంతిస్తుందని భావించారు. కానీ.. ఎంతసేపటికీ ఒక్క పిట్ట కూడా రాకపోవడంతో కుటుంబ సభ్యులు నిరాశతో వెనుదిరిగారు.
- Read More Telangana News And Telugu News