News

Badiga Ramakrishna, Pawan Kalyan ను కలిసిన మాజీ ఎంపీ.. జనసేనలోకి వెళతారా, మరి టీడీపీ పరిస్థితేంటి? – ex mp badiga ramakrishna meet janasena party chief pawan kalyan in vijayawada airport


Authored by Thirumala Babu | Samayam Telugu | Updated: 31 Oct 2022, 6:29 am

జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పర్యటనలో ఆసక్తికర పరిణామం జరిగింది. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో పవన్‌ను మాజీ ఎంపీ కలిశారు. మచిలీపట్నం నుంచి 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. 2009లో మళ్లీ కాంగ్రెస్ నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతున్నారా?

 

ప్రధానాంశాలు:

  • పవన్ కళ్యాణ్‌ను కలిసిన మాజీ ఎంపీ
  • జనసేన పార్టీలోకి వెళతారని నిర్ణయం
  • ఆయన కూతురు ఇప్పటికే టీడీపీలో
జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మంగళగిరి పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. జనసేనాని విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆసక్తికర పరిణామం కనిపించింది. మచిలీపట్నం మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ పవన్‌ను కలిశారు. ఇద్దరు ఒకర్ని ఒకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. దీంతో బాడిగ జనసేన పార్టీలో చేరతారా అన్న చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారా.. జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

బాడిగ రామకృష్ణ 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి మచిలీపట్నం ఎంపీగా విజయం సాధించారు. 2009లో మళ్లీ కాంగ్రెస్ నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణ చేతిలో ఓడిపోయారు. తన హయాంలో నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మంచిపేరు తెచ్చుకున్నారు. 2009లో ఓటమిపాలైన తర్వాత రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన పవన్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే రామకృష్ణ కుమార్తె శ్రీదేవి గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆమె పెడన సీటు ఆశించినా దక్కలేదు.. ఆమె మాత్రం పార్టీలో కొనసాగుతున్నారు. 2024లోనైనా అవకాశం వస్తుందని భావిస్తున్నారనే చర్చ జరుగుతోంది. శ్రీదేవిని మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపుతారనే ఊహాగానాలు వినిపించాయి. ఇలాంటి సమయంలో ఆమె తండ్రి పవన్‌ను కలవడం పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశమైంది. ఒకవేళ అదే జరిగితే సీనియర్ నేత, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. మరి మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ అడుగులు ఎటువైపు ఉంటాయో చూడాలి.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related Articles

Back to top button