News

Azharuddin: హెచ్‌సీఏపై పోలీసుల సీరియస్.. అజారుద్దీన్ సహా మ్యాచ్ నిర్వాహకులపై కేసు.. | Hyderabad Cricket Body Faces Police Case begumpet police have registered a case against hca president azharuddin


హైదరాబాద్ క్రికెట్‌ టికెట్‌ ఇష్యూని పోలీసుల సీరియస్‌గా తీసుకున్నారు. ఈ దందాలో కీలక పాత్ర పోషించిన హెచ్‌సీఏపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Azharuddin: హెచ్‌సీఏపై పోలీసుల సీరియస్.. అజారుద్దీన్ సహా మ్యాచ్ నిర్వాహకులపై కేసు..

Mohammad Azharuddin

Shaik Madarsaheb

Advertisement

Shaik Madarsaheb |

Sep 22, 2022 | 11:52 PM




Hyderabad Cricket Body Faces Police Case: హైదరాబాద్ క్రికెట్‌ టికెట్‌ ఇష్యూని పోలీసుల సీరియస్‌గా తీసుకున్నారు. ఈ దందాలో కీలక పాత్ర పోషించిన హెచ్‌సీఏపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హెచ్‌‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌తో పాటు.. మ్యాచ్‌ నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకున్న ఆధారాలతో హైదరాబాద్‌ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. తొక్కిసలాటలో గాయపడ్డ అదితి ఆలియా, ఎస్‌ఐ ప్రమోద్‌ ఫిర్యాదులతో కేసులు పెట్టారు. ప్రధానంగా హెచ్‌సీఏపై టికెట్‌ నిర్వాహణ, బ్లాక్‌లో అమ్మారన్న ఆరోపణలపై సెక్షన్ 420, సెక్షన్ 21, సెక్షన్ 22/76 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా ఈ తొక్కిసలాటకు కారణం హెచ్‌సీఏ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు తేల్చారు. ఇప్పటికే ఈ ఇష్యూపై గాయపడ్డ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button