Ayesha Takia: ప్రేమ కోసం కెరీర్ వదిలేసుకుంది.. సూపర్ హీరోయిన్ అయేషా లవ్ స్టోరీ ఎన్నో ట్విస్టులు.. | There are many twists in the love story of heroine Ayesha Takia and Farhan Azmi.. Do you know their love story? telugu cinema news
అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. అయోషా ప్రేమకథలో సినిమాకు మించిన ట్విస్టులు ఉన్నాయి తెలుసా. ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందామా.
ఒక్క సినిమాతోనే వెండితెరపై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. తొలి చిత్రంతోనే అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన తారలు ఉన్నారు. అందులో హీరోయిన్ అయోషా టాకియా ఒకరు. అక్కినేని నాగార్జున, సోనూ సూద్ ప్రధానపాత్రలలో 2005లో వచ్చిన ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ అయేషా టాకియా. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. హిందీలో సల్మాన్ సరసన వాంటెడ్ చిత్రంలో కనిపించిన అయేషా.. ఆ తర్వాత.. టార్జాన్ ది వండర్ ఫుల్ కార్, దిల్ మాంగే మోర్, సోచా నా థా, షాదీ నంబర్ 1, దోర్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. అయోషా ప్రేమకథలో సినిమాకు మించిన ట్విస్టులు ఉన్నాయి తెలుసా. ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందామా.
2009లో వ్యాపారవేత్త ఫర్హాన్ అజ్మీతో అయేషా ఏడడుగులు వేసింది. అయేషాకు 19 ఏళ్ల వయసులోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ముంబైలోని రెస్టారెంట్ నిర్వహించే ఫర్హాన్ అజ్మీతో పరిచయమైంది అయోషాకు. ఆ తర్వాత తరచూ ఆమె ఆ హోటల్‌కు వెళ్లడంతో వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. 2005 నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. కానీ తమ ప్రేమ విషయాన్ని వీరు ఎప్పుడూ బయటపెట్టలేదు. కొన్నాళ్లు ప్రేమలో ఉన్న వీరు 2009లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయేషా పెళ్లి విషయం తెలిసి ఆమె అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు.
పెళ్లి తర్వాత అయేషా ఇస్లాం మతంలోకి మారి.. తన ఇంటిపేరుతో.. అజ్మీని కూడా కలిపేసింది. వీరికి బాబు మికైల్ ఉన్నారు. కానీ పెళ్లి తర్వాత అయేషా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. ఆ తర్వాత కూడా ఆమెకు వరుస ఆఫర్స్ వచ్చినప్పటికీ అయేషా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. ఫర్హాన్ తో ప్రేమ, పెళ్లికి ముందు అయేషా.. హీరోయిన్ మనీషా కొయిరాలా సోదరుడు సిద్ధార్థ్ కొయిరాలతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది అయేషా.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి