News

attack for ice cream, ఐస్‌క్రీం కోసం బీఆర్ఎస్ నేత కుమారుడి హల్‌చల్.. మందలించిన మంత్రి హరీశ్ ! – brs leader son and his frinds attack on ice cream parlor staff in hyderabad


Harish Rao: ఐస్‌క్రీం కోసం అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి కుమారుడితో పాటు అతడి స్నేహితులు మద్యం మత్తులో హల్‌చల్ చేశారు. ఐస్ క్రీం పార్లర్ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. పార్లర్ సిబ్బంది ఎదురుదాడికి దిగగ్గా.. తప్పించుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ నేత కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు సంపత్ రెడ్డి కుమారుడు భరత్ రెడ్డి నగర శివారులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. భరత్‌ రెడ్డితోపాటు అతని స్నేహితులు.. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో అర్థరాత్రి వరకు మద్యం తాగారు. అనంతరం రాత్రి 1 గంట ప్రాంతంలో బంజారాహిల్స్‌లోని ఓ ఐస్‌ క్రీం పార్లర్‌కు వెళ్లి ఐస్‌ క్రీం కావాలంటూ దుకాణం షట్టర్‌ తలుపుతట్టారు. అప్పటికే దుకాణం మూసేయగా.. సమయం ముగిసిందని ఐస్‌క్రీం అమ్మటం కుదరదని పార్లర్‌లోని సిబ్బంది చందు, వెంకటేశ్, షోయబ్‌ వారికి చెప్పారు.

అయినా వినిపించుకోకుండా బలవంతంగా షట్టర్‌ తెరిచి లోపలికి వెళ్లారు. ఐక్‌ క్రీం ఎందుకు అమ్మరంటూ భరత్‌రెడ్డి అతని స్నేహితులు మద్యం మత్తులో దుకాణంలోని ముగ్గురిపై దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయిన భరత్ రెడ్డి మరికొందరు స్నేహితులను తీసుకొచ్చి పార్లర్ సిబ్బంది షోయబ్, చందు, వెంకటేశ్‌లపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. దీంతో పార్లర్ సిబ్బంది.. వారి చేతుల్లోని కర్రలు లాక్కొని ఎదురుదాడికి దిగారు. వారి దాడిని తప్పించుకునే క్రమంలో భరత్‌రెడ్డి కిందపడిపోగా.. తలకు తీవ్రగాయమైంది.

అప్రమత్తమైన స్నేహితులు భరత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడికి వైద్యం అందిస్తుండగా.. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు ఆసుపత్రికి చేరుకొని భరత్‌రెడ్డి, స్నేహితులను మందలించినట్లు తెలిసింది. ఈ ఘటనపై ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు రెండు బృందాలపై కేసు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

Read More Telangana News And Telugu News

Related Articles

Back to top button