News

Asia Cup Final,ఫైనల్‌లో టాస్ గెలిచిన శ్రీలంక.. సన్ రైజర్స్ ఆటగాడు ఎంట్రీ.. – asia cup final: sri lanka have elected to bat first against india


ఆసియా క‌ప్ 2023 ఫైన‌ల్ ప్రారంభమైంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దసున్ శనక బ్యాటింగ్ ఎంచుకున్నాడు. శ్రీలంక జట్టు ఒక మార్పుతో ఈ మ్యాచులోకి బరిలోకి దిగింది. మహీశ్ తీక్షణ స్థానంలో దుశన్ హేమంత జట్టులోకి వచ్చాడు.

ఇక గత మ్యాచులో రెస్ట్ తీసుకున్న టీమిండియా క్రికెటర్లు మొత్తం జట్టులోకి వచ్చేశారు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్‌లు తుది జట్టులో ఉన్నారు. అక్షర్ పటేల్ గాయంతో దూరంకాగా.. అతడి స్థానంలో వాషింగ్టను సుందర్‌ను ప్లేయింగ్ లెవెన్‌లోకి తీసుకున్నారు.

ఇవాళ జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్ 16వది. ఇప్పటివరకు జరగిన టోర్నీల్లో అత్యధికంగా భారత్ ఏడు సార్లు ట్రోఫీ ముద్దాడింది. తర్వాత స్థానంలో ఉన్న శ్రీలంక ఆరు సార్లు గెలిచింది. పాకిస్థాన్ జట్టు 2 సార్లు విజయం సాధించింది.

ఇక ఆసియా కప్‌లో ఈ మ్యాచ్ కాకుండా భారత్-శ్రీలంక జట్లు 22 సార్లు తలపడ్డాయి. చెరో 11 మ్యాచుల్లో విజయం సాధించాయి. నేటి మ్యాచులో గెలిచిన జట్టు విజయాల్లో లీడ్‌లోకి వెళ్లనుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో టైటిల్ పోరు జరుగుతోంది.

తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీందర్ జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్

శ్రీలంక:
పతుమ్ నిశాంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనుంజయ డి సిల్వ, దసున్ శనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, దుశన్ హేమంతా, ప్రమోద్ మధుసూధన్, మతీశ పతిరాన

Related Articles

Back to top button