Asia Cup 2022: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఆసియా కప్ నుంచి కీలక బౌలర్ ఔట్?

ఆసియా కప్ 2022 ప్రారంభం కావడానికి కేవలం 3 వారాలు మాత్రమే ఉన్నాయి. దీని కోసం భారత క్రికెట్ జట్టును ఇంకా ప్రకటించలేదు. జట్టు ఎంపికకు సంబంధించి ఇప్పటికే చాలా ప్రశ్నలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై కూడా ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో టీమిండియాకు నిలకడగా రాణిస్తున్న మీడియం పేసర్ హర్షల్ పటేల్ గాయం కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. వెస్టిండీస్ పర్యటనలో జట్టుతో కలిసి ఉన్న హర్షల్ టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.
ఆగస్టు 6, శనివారం ఫ్లోరిడాలో భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య నాల్గవ T20 మ్యాచ్ ప్రారంభం కావడంతో, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు హర్షస్ పటేల్ గాయంపై కొత్త అప్డేట్ను విడుదల చేసింది. అతను పక్కటెముక గాయంతో ఇబ్బంది పడ్డాడు. దాని కారణంగా అతను రెండవ, మూడవ మ్యాచ్‌లలో ఆడలేదు. రెండవ మ్యాచ్‌లోనే బోర్డు తెలిపింది.
ఈ గాయం నుంచి హర్షల్ పటేల్ పూర్తిగా కోలుకోలేదని బీసీసీఐ తెలిపింది. “హర్షల్ పటేల్ పక్కటెముక గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. అందుకే వెస్టిండీస్‌తో మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు” అని బీసీసీఐ తన ప్రకటనలో తెలిపింది.