News

ashu reddy, HBD Ashu Reddy: అషురెడ్డి బర్త్ డే స్పెషల్.. సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన తండ్రి – big boss beauty ashu reddy receives birthday gift mercedes benz car from her father


బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి (Ashu Reddy) బర్త్ డే సందర్భంగా ఆమె తండ్రి సర్ ‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఈ ఏడాదిలో తాను అందుకున్న మొదటి గిఫ్ట్ అంటూ ఆమె మురిసిపోతుంది. ఇంతకు ఆయన ఏం బహుమతి ఇచ్చాడంటే..?

 

బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి
టిక్ టాక్‌ వీడియోలు, సోషల్ మీడియాతో ఫేమ్ తెచ్చుకుంది అషురెడ్డి (Ashu Reddy). కొన్ని షార్ట్ ఫిలిమ్స్‌, ప్రైవేట్ సాంగ్స్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకుని.. బిగ్‌ బాస్ (Big Boss) హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఈ బ్యూటీ లైఫ్ పూర్తిగా ఛేంజ్ అయిపోయింది. టీవీ షోలతో ఫుల్ బిజీగా మారిపోయింది. కాంట్రవర్సీ ఇంటర్వ్యూలు, రాహుల్‌తో ట్రాక్, పవన్ కళ్యాణ్ టాటూలు, సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో అషు రెడ్డి నిత్యం వార్తల్లోనే ఉంటోంది. నేడు (సెప్టెంబర్ 15) ఈ బిగ్ బాస్ బ్యూటీ పుట్టిన రోజు.

ఈ సందర్భంగా తండ్రి నుంచి సర్‌ప్రైజ్ గిఫ్ట్ అందుకుంది అషు రెడ్డి. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన C200D అనే మోడల్ కారును తన కూతురికి బర్త్ డే గిఫ్ట్‌గా ఇచ్చారు అషురెడ్డి తండ్రి. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె షేర్ చేసుకుంది. ‘సారీ మమ్మీ.. డోంట్ బీ మ్యాడ్. ఇట్స్ డాడీ సర్‌ప్రైజ్‌’ అంటూ రాసుకొచ్చింది. బిగ్ బాస్ బ్యూటీకి కంగ్రాట్స్‌తో బర్త్ డే శుభాకాంక్షలు చెబుతున్నారు ఫాలోవర్స్.


కాగా.. ఈ కారు ధర దాదాపు రూ.70 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఈ ఏడాదిలో తాను అందుకున్న మొదటి గిఫ్ట్ అంటూ అషు రెడ్డి మురిసిపోతుంది. ప్రస్తుతం టీవీ షోలలో మెరుస్తున్న ఈ బ్యూటీ.. నితిన్ హీరోగా నటించిన ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాలో ఓ పాత్రలో నటించింది. బిగ్ బాస్ హౌస్‌లోకి రెండు సార్లు ఎంట్రీ ఇచ్చి.. బుల్లి తెర ప్రేక్షకులను అలరించింది.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.



Related Articles

Back to top button