Entertainment

Ashish Vidyarthi: 60 ఏళ్ల వయస్సులో రెండో పెళ్లి చేసుకున్న ఆశిష్ విద్యార్థి.. వధువు ఎవరంటే..?


ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి అస్సాంకు చెందిన రూపాలి బారువాను పెళ్లాడారు. గతంలో ఆయన అలనాటి నటి శకుంతల బారువా కుమార్తె రాజోషి బారువాను వివాహం చేసుకున్నారు. కానీ విబేధాల కారణంగా వీడిపోయారు. ఇప్పుడు ఇది రెండో పెళ్లి…

నటుడు ఆశిష్ విద్యార్థిని తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన ఎన్నో సినిమాలతో ద్వారా మనకు సుపరిచితుడు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో నటించాడు. ముఖ్యంగా పోకిరి సినిమాలో విలన్‌గా అతడి నటన నెక్ట్స్ లెవల్‌లో క్లిక్ అయ్యింది. గతంలో ఎక్కువ విలర్ రోల్స్ చేసిన ఈ యాక్టర్.. ఇప్పుడు ఫాదర్ తరహా రోల్స్ చేస్తున్నారు. తాజాగా 60 ఏళ్ల వయస్సులో ఈయన సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం.. అటు నార్త్ ఇండస్ట్రీ, ఇటు సౌత్ ఇండస్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ రూపాలి బారువాను గురువారం కోల్‌కతా క్లబ్‌లో ఆశిష్ విద్యార్థి పెళ్లాడారు. అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది. జాతీయ అవార్డు గెలుచుకున్న ఆశిష్ విద్యార్థి… గతంలో నటి శకుంతల బారువా కుమార్తె రాజోషి బారువాను పెళ్లి చేసుకుని.. విబేధాల కారణంగా దూరమయ్యారు. వీరికి అర్త్‌ విద్యార్థి అనే కొడుకు కూడా ఉన్నాడు.

కాగా ఆశిష్ విద్యార్థి 2వ భార్య రూపాలి కోల్‌కతాలో ఒక ఫ్యాషన్ స్టోర్‌ను రన్ చేస్తుంది. ఆశిష్, రూపాలి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో  రిజిస్ట్రీ వివాహం చేసుకున్నారు. “నా జీవితంలో ఈ దశలో, రూపాలిని పెళ్లి చేసుకోవడం ఒక అసాధారణ అనుభూతి”అని ఆశిష్ చెప్పుకొచ్చారు. ఆశిష్ విద్యార్థి 19 జూన్ 1962లో ఢిల్లీలో జన్మించారు. ఆయన తండ్రిది కేరళలోని కన్నూర్. అమ్మ బెంగాలీ. కానీ రాజస్థాన్‌లో నివాసం ఉండేవారు. వీళ్ల నాన్న గోవింద్ విద్యార్ధి ఫేమస్ థియేటర్ ఆర్టిస్ట్. తండ్రి ప్రభావంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కొద్ది కాలంలోనే నటుడిగా తన కంటూ స్పెషల్ మార్క్  తెచ్చుకున్నారు. ఇటీవల తెలుగులో వచ్చిన ‘రైటర్ పద్మభూషణ్‌’లో హీరో తండ్రి పాత్రలో కనిపించారు ఆశిష్ విద్యార్థి.

Ashish Vidyarthi Rupali Bar

Ashish Vidyarthi- Rupali Barua

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button