ChatGPT: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కనిపిస్తోన్న డెవలప్‌మెంట్ అనేక రంగాలపై ప్రభావం చూపిస్తుందనే ఆందోళనలు నెలకొన్నాయి. పలు రంగాల్లోని ఉద్యోగులను చాట్‌జీపీటీ లాంటి ఏఐ టెక్నాలజీ భర్తీ చేస్తాయనే వాదనలూ గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ ఆందోళనల మధ్యే గ్లోబల్ పెట్టుబడుల సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ (Goldman Sachs Report) తాజా నివేదిక బాంబును పేల్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఏర్పాడుతున్న మార్పుల కారణంగా కొద్ది ఏళ్లలోనే దాదాపు 30 కోట్ల ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని అంచనా వేసింది. లేబర్ మార్కెట్‌పై భారీ ప్రభావం (chatgpt job threat) చూపుతుందని పేర్కొంది. అమెరికా, యూరోప్ దేశాల్లో మూడింట రెండోంతు ఉద్యోగాలు ఆటోమేటెడ్‌గా మారిపోనున్నాయని తెలిపింది. ఈ మేరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంపై ఆర్థిక ప్రగతిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పు అనే పేరుతో చేసిన పరిశోధనలో కీలక విషాయలను వెల్లడించింది గోల్డ్‌మన్ శాక్స్.’ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence) అంచనాలకు అనుగుణంగా తన ఉత్పాదక సామర్థాయలను తీరిస్తే శ్రామిక రంగంలో ఒడుదొడుకులు ఉంటాయి. అమెరికా, యూరప్ దేశాల్లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో మూడించ రెండింట ఆటోమేషన్‌కు ప్రభావితమవుతాయి. దాంతో పాటు ప్రస్తుతం చాలా పనులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రత్యామ్నాయంగా మారుతోంది. కానీ, టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది కొత్త కొత్త ఉపాధి అవకాశాలు సైతం పెరుగుతాయి. ఉత్పాదకత మరింత పెరుగుతుంది. దాని ద్వారా ప్రపంచ జీడీపీ 7 శాతానికి పెంచేందుకు దోహదపడుతుంది. ‘ అని పేర్కొంది గోల్డ్‌మన్ శాక్స్ నివేదిక. చాట్‌జీపీటీ లాంటి అధునాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు మనుషుల మాదిరిగానే కంటెంట్‌ను తయారు చేస్తాయని పేర్కొంది. వచ్చే దశాబ్ధంలో ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుందని తెలిపింది.
ప్రస్తుతం 60 శాతం మంది మనుషులు చేస్తున్న పనులు 1940ల్లో అసలు ఉనికిలోనే లేవని గుర్తు చేసింది నివేదిక. 1980 తర్వాత సాంకేతికతలో వచ్చిన మార్పుల వల్ల కలిగిన ఉద్యోగాల సృష్టితో పోలిస్తే వేగంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొంది. జనరేటివ్ ఏఐ డెవలప్‌మెంట్ గతంలోని ఐటీ మాదిరిగానే ఉంటే మాత్రం ఉపాధి అవకాశాలను తగ్గించనుందని గోల్డ్‌మన్ శాక్స్ తెలిపింది. చాట్‌జీపీటీ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థల ద్వారా కార్యనిర్వహణ, న్యాయ శాఖలపై అధిక ప్రభావం ఉండనుందని నివేదిక పేర్కొంది. అలాగే అడ్మినిస్ట్రేటివ్ రంగంలో 46 శాతం, లీగల్ విభాగంలో 44 శాతం మంది ఉద్యోగులకు ముప్పు పొంచి ఉంటుందని పేర్కొంది. మరోవైపు.. నిర్వహణ, ఇన్‌స్టాలేషన్, నిర్మాణ రంగం, రిపేర్ వంటి వాటిపై తక్కువ ప్రభావం ఉంటుందని పేర్కొంది.
Read Latest Business News and Telugu News
Hyderabad: హైదరాబాద్‌దే అగ్రస్థానం.. పెద్ద ఆఫీసు స్థలాలకు కేరాఫ్.. క్యూ కడుతున్న కంపెనీలు!
మరో బాంబ్ పేల్చిన Hindenburg.. ఈసారి ‘జాక్ డోర్సే’ వంతు.. కుప్పకూలిన కంపెనీ షేర్లు!
Adani: అదానీకి ఊహించని దెబ్బ.. వారానికి రూ.3,000 కోట్లు నష్టం.. ఏడాదిలో 60 శాతం డౌన్!