News

Arjun Ambati Wild Card Entry,Ambati Arjun: అర్జున్ అంబటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. బిగ్ బాస్ హౌస్‌కి స్వాగతం పలుకుతున్న సీరియల్ ఫ్యాన్స్ – ambati arjun will be entering first wild card of bigg boss 7 telugu


Bigg Boss 7 Telugu Wild Card Entry: ఏమయ్యా ఉల్టా పుల్టా బిగ్ బాసూ.. అప్పుడే రెండో వారం వచ్చేస్తుంది.. ఉల్టా లేదూ.. పుల్టా లేదూ.. గత సీజన్‌ల కంటే భిన్నం అన్నావ్ చివరికి సున్నం పెట్టేట్టు ఉన్నావే అనేట్టుగా సాగింది తొలివారం ఆట. అయితే రెండో వారంలో కాస్త పుంజుకుంది. ముఖ్యంగా నామినేషన్స్ ఎపిసోడ్ అదిరిపోయింది. ఇక ఆటను మరింత రంజుగా మార్చేందుకు రంగం సిద్దమైంది. దానిలో భాగంగా.. వైల్ కార్డ్ ఎంట్రీలను హౌస్‌లోకి పంపుతున్నారనే లీక్ బయటకు వచ్చింది. ఈ సీజన్ కంటెస్టెంట్స్‌లో ఎక్కువగా వినిపించిన పేరు అర్జున్ అంబటి (Ambati Arjun).

కానీ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన 14 మంది కంటెస్టెంట్స్‌లో అర్జున్ అంబటి లేడు. అయితే ఇప్పుడు రెండు వారాల తరువాత.. ఆటను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు.. అర్జున్ అంబటిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి పంపబోతున్నారట. ఇతను హౌస్‌లోకి వెళ్తే ఆట రంజుగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహంలేదు. ఇప్పటికే హౌస్‌లో సీరియల్ బ్యాచ్ అంటూ దండుపాళ్యం బ్యాచ్‌లా గ్రూప్ కట్టారు. ఒకే మాట ఒకే బాట ఒకే ఆట అన్నట్టుగా గ్రూపిజం సాగిస్తున్నారు. ఇప్పుడు అర్జున్ అంబటి కూడా రావడంతో అతను సీరియల్ గ్రూప్‌లో చేరుతాడా? లేదంటే.. సింగిల్‌గానే ఆట ఆడతాడా? అన్నది ఆసక్తిగా మారింది.

అర్జున్ అంబటి.. సీరియల్స్‌లో సూపర్ హిట్.. ఇప్పుడు బిగ్‌బాస్‌లో
అర్జున్ అంబటి గురించి బుల్లితెర ఆడియన్స్‌కి పరిచయమే అక్కర్లేదు. ఎందుకంటే అగ్ని సాక్షి, దేవత వంటి సీరియల్స్‌తో ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానం సంపాదించుకున్నాడు. సీరియల్స్‌తో పాటు అనేక సినిమాల్లో కూడా మంచి పాత్రలు పోషించాడు అర్జున్. మరి తన కెరీర్ విశేషాలు చూద్దామా.

సినిమాలే ముంద
నిజానికి సీరియల్‌లోకి ఎంట్రీ ఇచ్చే ముందే పలు సినిమాల్లో నటించాడు అర్జున్. అగ్నిసాక్షి కంటే ముందు అర్ధనారి అనే సినిమాలో నటించాడు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత దేశముదురు, సౌథ్యం, అశ్వమేధం లాంటి సినిమాల్లో కూడా మెరిశాడు. ఇవి చేసిన తర్వాత ‘దేవత’ సీరియల్ ఆఫర్ వచ్చింది. ఈ ధారావాహిక సూపర్ హిట్ కావడంతో అర్జున్ కెరీర్ మలుపు తిరిగింది.

సాఫ్ట్ వేర్ ఇక్కడా.. మామూలుగా ఉండదు
స్క్రీన్‌ ముందుకు రాకముందు అర్జున్ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసేవాడు. చెన్నై, హైదరాబాద్‌లలోని ఐటీ కంపెనీలో జాబ్ చేసి సినిమాలంటే మక్కువతో రిజైన్ చేసి వచ్చేశాడు. అయితే చాలా మంది అర్జున్‌‍ని మొదట్లో బెంగుళూరు అబ్బాయి అనుకున్నారు. కానీ తాను పుట్టి పెరిగింది విజయవాడ దగ్గర నర్సరావు పేట. ఆయన తండ్రి ఫిల్మ్‌ డిస్టిబ్యూటర్‌‌గా చేసేవారు. దీంతో చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది. ఇక ఉద్యోగం చేసే సమయంలోనే సురేఖ అనే అమ్మాయితో పరిచయం అయి అది ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో సురేఖను పెళ్లి చేసుకున్నాడు అర్జున్.

ఇక ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు పలు పండగ ఈవెంట్లలో సందడి చేస్తున్నాడు. కొత్త సీరియల్ ఏమీ స్టార్ట్ కాకపోవడంతో బిగ్‌బాస్ ఆఫర్ యాక్సెప్ట్ చేసి హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అర్జున్ అంబటి. అయితే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఆయన ఒక ఫొటో షేర్ చేశారు. నోటిఫికేషన్స్ కోసం చూస్తూనే ఉండండి అని బిగ్ బాస్ ఎంట్రీకి సంబంధించి హింట్ ఇవ్వడంతో.. రండి రండి.. ఇప్పటికే ఆలస్యం చేశారు.. వెల్కమ్ అంటూ స్వాగతం పలుకుతున్నారు అర్జున్ అంబటి అభిమానులు.

Related Articles

Back to top button