Apsrtc Tirumala Darshan Tickets,తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ మరో శుభవార్త – apsrtc hikes tirumala special darshan tickets quota
ప్రస్తుతం బుక్ చేసుకునే టికెట్లు ఈ నెల 15 నుంచి అక్టోబరు 7 లోపు ప్రయాణం, దర్శనానికి ఉపయోగపడతాయి. అధికారిక వెబ్‌సైట్ www.apsrtconline.in లో అదనపు కోటా టికెట్ల బుకింగ్ మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చిందని పల్నాడు జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారి ఎన్.వి.శ్రీనివాసరావు తెలిపారు. తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేసుకునే భక్తులు దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.
ఏపీఎస్ ఆర్టీసీ మాత్రమే కాదు తెలంగాణ ఆర్టీసీ కూడా తిరుమల వెళ్లేవారికి రూ.300 శ్రీఘ్రదర్శనం టికెట్లను అందబాటులోకి తెచ్చింది. బస్ టికెట్ ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ చేసుకునే సమయంలోనే రూ.300 దర్శన టికెట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే కర్ణాటక, తమిళనాడు ఆర్టీసీలు కూడా ప్రయాణికులకు బస్ టికెట్లతో పాటు రూ.300 టికెట్లు అందిస్తున్నాయి.
నేడు శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆడికృత్తిక
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నేడు ఆడికృత్తిక పర్వదినం జరగనుంది. ఇవాళ ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు అర్చకులు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అలాగే మధ్యాహ్నం అభిషేకం చేపడతారు.. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి నాలుగేళ్ల పాటు అందించిన సేవలు అనుసరణీయమని నూతనంగా టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న భూమన కరుణాకర్‌రెడ్డి. అన్నారు. పాలకమండలి సమావేశంలో ఈ మేరకు ఆయన తీర్మానం ప్రవేశపెట్టారు. వైవీ సుబ్బారెడ్డి తన పదవీకాలంలో సామాన్య భక్తులకు మెరుగైన వసతులు కల్పించడానికి.. దేవస్థానం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. వివాదరహితుడు, సౌమ్యుడు అయిన సుబ్బారెడ్డి నుంచి తాము చాలా నేర్చుకున్నామని చెప్పారు. బోర్డు సభ్యులంతా ఆయన సేవలను కొనియాడారు. అనంతరం భూమన కరుణాకర్‌రెడ్డి శాలువతో సుబ్బారెడ్డిని సన్మానించారు. భూమన కరుణాకర్ రెడ్డి గురువారం టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
- Read Latest Andhra Pradesh News and Telugu News