News

ap rains, ఏపీ ప్రజలకు చల్లని శుభవార్త.. ఈ ప్రాంతాలకు వర్ష సూచన! – amaravati weather department says that will fall rain in andhra pradesh


ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అమరావతి వాతావరణ కేంద్రం చల్లటి శుభవార్త చెప్పింది. రాబోయే 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దక్షిణ తమిళనాడు పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.ఉత్తర- దక్షిణ ద్రోణి ఇప్పుడు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తున విస్తరించి ఉన్నట్లు పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో సోమవారం, మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

అయితే, ఏపీలో గరిష్ట ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకటి, రెండు చోట్ల గంటకు 40 కి.మీ. నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కొన్ని చోట్ల గంటకు 30- 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

బాబోయ్ ఎండలు.. బండరాయి పగిలిపోయింది

Related Articles

Back to top button