ap jio 5g cities, ఏపీలో మరో 2 నగరాల్లో జియో 5G సేవలు.. అందరికీ వెల్కమ్ ఆఫర్! – reliance jio starts 5g services in tirupati and nellore
ఇక, 10 నగరాల్లోని జియో వినియోగదారులు సోమవారం నుంచి ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా గరిష్టంగా 1 జీబీపీఎస్+ వేగంతో అపరిమిత డేటాను పొందేందుకు జియో వెల్కమ్ ఆఫర్‌కు ఆహ్వానిస్తోంది. ఈ సేవలపై జియో ప్రతినిధి మాట్లాడుతూ.. 4 రాష్ట్రాల్లోని ఈ 10 నగరాల్లో జియో ట్రూ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. కొత్త సంవత్సరం 2023లో ప్రతి జియో వినియోగదారుడికి 5జీ ప్రయోజనాలను అందించాలని భావిస్తున్నట్లు చెప్పారు. కాబట్టి తాము దేశవ్యాప్తంగా 5జీ రోల్ అవుట్ వేగాన్ని పెంచుతామన్నారు.
కొత్తగా 5 జీ సేవలు ప్రారంభించిన నగరాలు దేశంలోనే ముఖ్యమైన పర్యాటక, వాణిజ్య గమ్యస్థానాలు అని.. ముఖ్యమైన విద్యా కేంద్రాలని జియో ప్రతినిధి తెలిపారు. దీంతో ఈ ప్రాంతంలోని వినియోగదారులు ఉత్తమ టెలీకమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను పొందుతారని పేర్కొన్నారు.