ap group 1 prelims, ఏపీలో ప్రశాంతంగా గ్రూప్-1 ప్రిలిమ్స్: మొబైల్ చూస్తూ పరీక్ష రాసిన ఓ అభ్యర్థి! – ap group 1 prelims exam completed and one person caught due to copying
అయితే, ఈ సారి గ్రూప్-1 పరీక్ష పేపర్‌పై అభ్యర్థుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పలు ప్రశ్నలు ఎక్కువ నిడివితో ఇచ్చారని, చదవి అర్థం చేసుకునేందుకే ఎక్కువ సమయం పట్టిందని అభ్యర్థులు తెలిపారు. ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు తక్కువ సమయమే మిగిలిందని తెలిపారు. కొందరు అభ్యర్థులు మాత్రం.. ఉద్యోగార్థుల సత్తా పరీక్షించేందుకే ఎక్కువ నిడివిగల ప్రశ్నలు ఇచ్చారని అభిప్రాయపడ్డారు. గ్రూప్-1 ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.