News

ap capital, రాజధానిలో తీరనున్న పేదల సొంతింటి కల.. ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధం! – cm ys jagan mohan reddy will distribute land to poor men


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి ప్రాంతంలో.. పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రాజధాని అమరావతి ప్రాంతంలో పేద ప్రజల సొంతింటి కల నెరవేరనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. శుక్రవారం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. వెంకటపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభకు 50 వేల మంది లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తంగా సుమారు రెండు లక్షల మంది వస్తారని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 50,392 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు. వీటిలో ఎన్టీఆర్ జిల్లాకు కేటాయించిన 741.93 ఎకరాల్లో 14 లే అవుట్లు వేశారు. వీటిని 27,532 మంది లబ్ధిదారులకు అందించనున్నారు. గుంటూరు జిల్లాకు కేటాయించిన 650 ఎకరాల్లో 11 లే అవుట్లు వేసి అభివృద్ధి చేశారు. వీటిని 23,860 మందికి ఇవ్వనున్నారు. ఇదే వేదికపై నుంచి అమరావతి ప్రాంతంలోని 5,024 టిడ్కో ఇళ్ల పంపిణీ కూడా చేపట్టనున్నారు. అమరావతి పరిధిలో మొత్తం 1402.58 ఏకరాల్లో 25 లే అవుట్లు వేసి అభివృద్ధి పనులు చేపట్టారు.

మరోవైపు పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్న టీడీపీ తీరుపై మంత్రులు ధ్వజమెత్తారు. పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్లాయి. న్యాయస్థానాలు కూడా సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటాన్ని సమర్థించాయి. అయినప్పటికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు అమరావతి జేఏసీ శుక్రవారం ఈ ప్రాంతంలో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీంతో ప్రభుత్వం ఈ ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. అలాగే, భారీ పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా పట్టాల పంపిణి చేస్తుండటంతో.. ఎక్కడా నిరసనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు

బందరు పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించిన జగన్‌

Related Articles

Back to top button