News

Ap Assembly Session From September 21st,ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్.. కీలక బిల్లులు తీసుకురానున్న ప్రభుత్వం – andhra pradesh assembly session likely to start from september 21st


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు జగన్ సర్కార్ సిద్ధమైంది. వచ్చే వారంలో అసెంబ్లీ సమావేశాల తేదీలను ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ నెల 21 నుంచి ఐదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. అవసరాన్ని బట్టి మరో రెండు రోజులు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. సీపీఎస్‌ ఉద్యోగులకు ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న జీపీఎస్‌ సంబంధిత బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది అంటున్నారు.

ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనపై ఉద్యోగులు ఇటీవల సమావేశంలో కొన్ని మార్పులు కోరారు. సీఎం నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోసారి భేటీ అయి వీటిని ఖరారు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేస్తే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడతారని చెబుతున్నారు. అలాగే కొన్ని ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు ప్రభుత్వ, పార్టీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

మరోవైపు ఇవాళ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో ఉంటారని చెబుతున్నారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలతో భేటీ అవుతారని తెలుస్తోంది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా జీ20 సమావేశాల బిజీగా ఉన్నారు. హస్తిన పర్యటనకు వెళితే చంద్రబాబు అరెస్ట్ అంశంపై జగన్ వాళ్లతో చర్చించనున్నట్లు సమాచారం అందుతోంది. కేంద్రం దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలకు సిద్ధం అవుతోందని కొద్దిరోజుల కిందట వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో జమిలి ఎన్నికలపై కేంద్రంతో జగన్ చర్చలు జరుపుతారా అనే చర్చ జరుగుతోంది.

  • Read More Andhra Pradesh News And Telugu News

Related Articles

Back to top button