Anushka-Naveen: అనుష్క.. నవీన్ పోలిశెట్టి సినిమా టైటిల్ ఏంటో తెలుసా ?.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..
గత కొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అప్డేట్స్ గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్.
డైరెక్టర్ అనుదీప్ కేవీ తెరకెక్కించిన జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయ్యాడు హీరో నవీన్ పోలిశెట్టి. ఈ సినిమాతో యంగ్ హీరో క్రేజ్ మారిపోయింది. కానీ ఆ తర్వాత మాత్రం పెద్దగా సినిమాలు ప్రకటించలేదు. ప్రస్తుతం ఆయన చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న చిత్రంలో నవీన్ పోలిశెట్టి కథానాయికుడిగా నటిస్తున్నారు. ఇందులో నవీన్ సరసన హీరోయిన్ అనుష్క శెట్టి నటిస్తోంది. గత కొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అప్డేట్స్ గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్.
నవీన్, అనుష్క కాంబోలో రాబోతున్న ఈ సినిమా పేరును ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’గా ఫిక్స్ చేస్తూ.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో వీరిద్దరి లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. అనుష్క కెరీర్ లో 48వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ మహేష్ బాబు దర్శకత్వం వహిస్తుండగా.. రథన్ సంగీతం అందిస్తున్నారు.
అనుష్క వెండితెరపై కనిపించి దాదాపు రెండున్నరేళ్లు దాటింది. ఆమె చివరగా కనిపించిన సినిమా నిశ్సబ్దం. 2020 అక్టోబర్ 2న నేరుగా ఓటీటీలో విడుదలైంది ఈ చిత్రం. మిస్టరీ జానర్ లో వచ్చిన ఈ మూవీలో అనుష్క మూగ, చెవిటి అమ్మాయిగా నటించారు. అయితే ఈ సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న అనుష్క ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రంలో నటిస్తున్నారు.
Introducing our most favourite combo; #MissShettyMrPolishetty to you all🤩
Get ready for a Rollercoaster ride of Entertainment this Summer@MsAnushkaShetty @NaveenPolishety @filmymahesh @radhanmusic #NiravShah #RajeevanNambiar #KotagiriVenkateswararao @UV_Creations @adityamusic pic.twitter.com/mkG8bWrMnz
Advertisement— UV Creations (@UV_Creations) March 1, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి