News

anuradha murder case, అనురాధ హత్య కేసులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు.. 15 ఏళ్లుగా ఇద్దరూ కలిసే.. – police remand report of malakpet nurse anuradha murder case


హైదరాబాద్‌లో సంచలనంగా మారిన మలక్‌పేట నర్స్ అనురాధ మృతి కేసులో కీలక మలుపులు తిరుగుతోంది. అనురాధ మృతి కేసును రాచకొండ పోలీసులకు బదిలీ చేశారు. కాగా.. ఈ కేసులో నిందితుడు చంద్రమౌళి అలియాస్ చంద్రమోహన్ అరెస్ట్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. 15 ఏళ్లుగా చంద్రమౌళి, అనురాధలు సహజీవనం కొనసాగిస్తున్నారు. వీరి సహజీవనం సాఫీగా సాగిపోతున్న సమయంలో అనురాధ లక్షల రూపాయల నగదు బంగారు ఆభరణాలు చంద్రమౌళికి ఇచ్చింది. అయితే చంద్రమౌళితో అనురాధకు గత కొన్నాళ్లుగా విభేదాలు తలెత్తాయి. ఈవిభేదాల కారణంగా అనురాధ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే అనురాధ తన పెళ్లి కోసం మాట్రిమోనీలో ప్రకటనలు కూడా ఇచ్చింది. అనురాధ తాను పెళ్లి చేసుకోబోతున్నానని.. తన డబ్బు, నగలు తిరిగివ్వాలని చంద్రమోహన్‌ను డిమాండ్ చేసింది.

అయితే అంతా బాగున్న సమయంలో ఇచ్చిన రూ.17 లక్షల నగదు, 2 కిలోలకు పైగా బంగారం తిరిగివ్వాలని అనురాధ.. నిందితుడు చంద్రమౌళిని నిలదీసి అడిగింది. ప్రతిరోజు అనురాధ డబ్బుల విషయంలో చంద్రమౌళితో గొడవపడేది. ఈ క్రమంలోనే చంద్రమౌళి అనురాధను చంపేస్తే డబ్బులు, నగలు ఇవ్వాల్సిన అవసరముండదని నిర్ణయించుకున్నారు. అయితే.. అనురాధకు కూతురితో పాటు బంధువులెవరితోనూ సరిగా సంబంధాలు లేవు. దీంతో.. అనురాధను చంపినా బంధువులెవరూ రారని చంద్రమౌళి గుర్తించి మాస్టర్ ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే.. రోజూలాగే ఘటన జరిగిన రోజు కూడా అనురాధతో గొడవ జరిగింది. దీంతో.. ఆగ్రహానికి లోనైన చంద్రమౌళి అనురాధపై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. అంతే కాదు.. 15 కత్తిపోట్లు పొడిచి చంపాడు.

హత్య చేసిన అనంతరం చంద్రమౌళి ఒకరోజు పాటు అనురాధ మృతదేహాన్ని బయటే ఉంచాడు. ఆ సమయంలో మృతదేహాన్ని ఏవిధంగా ముక్కలు ముక్కలుగా చేయాలో యూట్యూబ్‌‌లో చూసి నేర్చుకున్నాడు. మరుసటి రోజు అనురాధ గది పక్కన అద్దెకు ఉన్న వారు ఊరికెళ్లాక.. మృతదేహాన్ని ముక్కలుగా కట్ చేయడానికి స్టోన్‌ కట్టర్ తెచ్చాడు. ఆ స్టోన్‌ కట్టర్‌తో అనురాధ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ప్యాక్‌ చేసి ఫ్రిజ్‌లో దాచి పెట్టాడు. ఇలా చేసిన 5 రోజుల తర్వాత అనురాధ తలను తీసుకెళ్లి మూసీలో పడేశాడు. మృతదేహం నుంచి వాసన రాకుండా రకరకాల కెమికల్స్‌ వాడాడు.

తన మీద ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా అనురాధ చార్‌ధామ్‌ యాత్రకు వెళ్తున్నట్లుగా ఆమె కూతురుతో చంద్రమౌళి చాటింగ్‌ చేశాడు. అనురాధ సెల్‌ఫోన్‌ను చార్‌ధామ్‌కు తీసుకెళ్లి ధ్వంసం చేయాలని ప్లాన్ చేశాడు. అనంతరం ఫ్రిజ్లో ఉన్న అనురాధ భాగాలను ఒక్కొక్కటిగా ఒక్కొక్క ప్రాంతంలో పడేయాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఇంతలోనే మూసీ నదిలో మొండెం లేని తల దొరకడంతో పోలీసులు దర్యాప్తు కొనసాగించి నిందితుడు చంద్రమౌళిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

పెట్రోల్ బంకుల్లో 2 వేల నోట్ల కష్టాలు

‘తమాట కూర ఉడుకుతంది.. బుక్కెడు బువ్వ తినిపోదువాగు బిడ్డా’.. రసమయిపై వృద్ధురాలి ఆప్యాయత

  • Read More Telangana News And Telugu News

Related Articles

Back to top button