News

Anti-ageing Tips: వయసు పెరిగినా యంగ్ గా ఉండాలా.. అయితే ఈ టిప్స్ మీకోసమే! – Telugu News | Anti ageing Tips: These tips helps to skin Collagen production, check here is details


కొల్లాజెన్ శరీరానికి అత్యంత అవసరమైన ప్రోటీన్స్ లో ఇది కూడా ఒకటి. కొల్లాజెన్ చర్మాన్ని అందంగా మార్చడంలో సమాయం చేస్తుంది. అంతే కాకుండా ఎముకలు బలంగా, దృఢంగా ఉండేలా హెల్ప్ చేస్తుంది. వయసు పెరిగినా యంగ్ లుక్ లో కనిపించాలంటే కొల్లాజెన్ అత్యవసరం. మీరు చాలా మందిని చూసే ఉంటారు. కొంత మందికి వయసు ఎక్కువగా ఉన్నా యంగ్ లుకింగ్ లో ఉంటారు. అలాగే ఇంకొంత మంది చిన్న వయసులోనే ముసలి వారిలా ఉంటారు. దీనికి కారణం కొల్లాజెన్. కేవలం చర్మాన్ని మెరిపించడమే కాకుండా బరువు తగ్గించడంలో, మెదడుని యాక్టీవ్ చేయడంలో కొల్లాజెన్ బాగా సహాయ పడుతుంది.

సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి:

అంతే కాకుండా కొల్లాజెన్ ను శరీరంలో సహజంగా పెంచుకోవచ్చు. సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. సమతుల్యమైన ఆహారం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే ఉదయం వ్యాయామం, యోగా, వాకింగ్ వంటివి చేయడం ద్వారా కూడా కొల్లాజెన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అంతే కాకుండా నాణ్యమైన నిద్రకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. విశ్రాంతి తీసుకోవడం వల్ల కూడా కొల్లాజెన్ ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. మంచి బ్రైట్ స్కిన్ సాధించడంలో, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో విటమిన్ సి, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి బూస్టింగ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా కొల్లాజెన్ ఉత్పత్తి అనేది పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

సూర్యరశ్మి నుంచి దూరంగా ఉండండి:

సూర్య కిరణాల వల్ల శరీరంలోని ఫైబర్ అనేది విచ్ఛిన్నం అవుతుంది. ఇది అకాల వృద్ధాప్యానికి దారి తీస్తుంది. కాబట్టి సూర్య రశ్మి నుండి మీ చర్మాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రతి రోజూ సన్ స్క్రీన్ ను అప్లై చేయడం వల్ల కొల్లాజెన్ ను రక్షించుకోవడంలో, కొల్లాజెన్ తగ్గకుండా చూసు కోవచ్చు. అదే విధంగా నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరాం, చర్మం హైడ్రేట్ గా ఉంటాయి. నీరు ఎక్కువగా తీసుకున్నా కొల్లాజెన్ ఉత్పత్తి అనేది పెరుగుతుంది. ఇంకా కొల్లాజెన్ తో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టు బలంగా ఉంటుంది:

జుట్టును అందంగా మార్చడంలో కూడా కొల్లాజెన్ బాగా సహాయ పడుతుంది. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ మెలనిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. అందుకే ఒక లాంటి ఏజ్ వచ్చేసరికి జుట్టు నెరిసి పోతుంది. తెల్లగా లేదా బూడిద రంగులోకి మారుతుంది. అంతే కాకుండా జంక్ పుడ్ లాంటివి తీసుకున్నా కూడా జుట్టు కలర్ అనేది మారి పోతుంది. అదే కొల్లాజెన్ ఉన్న ఆహారం తీసుకుంటే జుట్టు కలర్ మారకుండా.. నల్లగా, అందంగా ఉంటుంది.

Advertisement

బరువు తగ్గానికి కూడా హెల్ప్ చేస్తుంది:

బరువును తగ్గించడంలో కూడా కొల్లాజెన్ ఉపయోగ పడుతుంది. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థను పెంచడానికి సహాయ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఊబకాయం వంటి సమస్యలు ఎదరవ్వవు.

చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కొల్లాజెన్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి, వృద్ధాప్యాన్ని తగ్గించడంలో, ముడతలు పడకుండా, మొటిమలు, ఇతర చర్మ సమస్యలు రాకుండా చూడటంలో కొల్లాజెన్ బాగా పని చేస్తుంది.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

Related Articles

Back to top button