మొన్న రష్మిక, నిన్న కత్రినా.. నేడు కాజోల్. డ్రెస్ ఛేంజింగ్ వీడియో అంటూ..
డీప్ ఫేక్ వీడియో అంశం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీతో పాటు సామాన్య జనాలను షేక్ చేస్తోంది. వేరే మహిళ వీడియోకు రష్మిక ముఖాన్ని డీప్ ఫేక్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ కావడంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డీప్ ఫేక్ టెక్నాలజీ ఎంత ప్రమాదకరమో సమాజానికి అర్థమైంది.
దీంతో ఈ అంశంపై అటు ఇండస్ట్రీతో పాటు సామాన్ జనాలు సైతం భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు సైతం డీప్ ఫేక్ టెక్నాలజీపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. సోషల్ మీడియాలో తమ ఫొటోలను డీపీలుగా పెట్టుకోవద్దని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే మొన్న రష్మిక వీడియో, నిన్న కత్రినా వీడియో మర్చిపోకముందే.. ఇప్పుడు మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా బాలీవుడ్ నటి కాజోల్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాజోట్ డ్రెస్ మార్చుకుంటున్నట్లుగా ఉన్న ఓ వీడియోను రూపొందించి నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఓ మహిళ డ్రస్ మార్చుకుంటున్నట్లున్న వీడియోలోను డీప్ ఫేక్ టెక్నాలజీతో కాజల్ ఫొటోను జోడించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయ్యింది. అయితే ఈ వీడియో కాస్త నెట్టింట చక్కర్లు కొట్టడంతో.. సదరు వీడియో ఫేక్ అని తేలింది. దీంతో మరోసారి టెక్నాలజీ దుర్వినియోగం అంశం తెరపైకి వచ్చింది.
డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సమస్య రోజురోజుకీ ఎక్కువవుతుండడంతో భారత ప్రభుత్వం సైతం స్పందించింది. ఇందులో భాగంగానే భారత ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఎవరైనా డీప్ ఫేక్ వీడియోకు సంబంధించి ఫిర్యాదు చేస్తే 36 గంటల్లోగా సోషల్ మీడియా సైట్స్ తమ ప్లాట్‌ఫామ్స్ నుంచి వీడియోను డిలీట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..