anil kumar yadav, సీఎం జగన్ గెటౌట్ అన్నా వైసీపీ నుంచి వెళ్లేది లేదు: అనిల్ యాదవ్ – ysrcp mla anil kumar yadav hot comments on cm ys jagan mohan reddy
ఎవరైనా పెళ్లికి వెళ్తే అక్షింతలు వేసి బాగుండాలని దీవిస్తారని, కానీ శత్రువుల పెళ్లికి వెళ్తే, ఆ తాళి ఎప్పుడు తెగిపోతుందా అని ఆశిస్తామని అనిల్ యాదవ్ అన్నారు. అయితే, తాను అలాంటి వ్యక్తిని కాదని.. అసలా పెళ్లికి కూడా వెళ్లాల్సిన అవసరం లేదని అనుకుంటానని చెప్పారు. ముందు నవ్వుతూ మాట్లాడి, వెనక గోతులు తవ్వే మనస్తత్వం తనది కాదని స్పష్టం చేశారు.
ఇక, మీడియాతో తనపై తప్పుడు వార్తలు రాస్తున్నారని అనిల్ యాదవ్ మండిపడ్డారు. తనకు మోకాలి నొప్పి ఉందని, దాని ట్రీట్మెంట్ కోసం 15 రోజుల పాటు నెల్లూరులో ఉండటం లేదని క్లారిటీ ఇచ్చారు. గతేడాది కూడా తాను మోకాలి నొప్పితో ఇబ్బంది పడ్డ విషయం నెల్లూరు ప్రజలకు తెలుసన్నారు. ఈసారి ఆ నొప్పి తిరగబెట్టిందని మళ్లీ ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నానని చెప్పారు. ఈలోగా కొంత మంది తనపై తప్పుడు ప్రచారం మొదలుపెట్టారని ఆరోపించారు. తాను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి దూరమయ్యానని.. టీడీపీలో చేరుతున్నానంటూ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు ఫుడ్ కోసం అలాంటి వార్తలు రాస్తున్నాయని మండిపడ్డారు. తనకు సీఎం జగన్ అంటే తనకు ఓ వ్యసనం అని, ఆయన తనను పార్టీ నుంచి గెటౌట్ అన్నా కూడా ఎక్కడికీ వెళ్లనని చెప్పారు. ఆ విషయంలో తనకు సిగ్గు, లజ్జ, మానం, అభిమానం కూడా లేవని వ్యాఖ్యానించారు.