News

Andhra Pradesh Rain Forecast


Andhra Rains : బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది. సాయంత్రానికి ఇది వాయువ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. గురువారం నాటికి ఇది మరింత బలపడనుంది. ఆ తర్వాత మూడు రోజుల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశా అంచనా వేస్తోంది. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో ఎక్కువచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు పడతాయంటున్నారు. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయంటున్నారు.

ఇవాళ అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో బుధవారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ, జియ్యమ్మవలస ప్రాంతాల్లో అత్యధికంగా 7 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. అంతేకాదు బుధవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. తిరుపతిలో 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

ఇక పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో 68.8 మిల్లీ మీటర్లు, పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మ వలసలో 65.8, ఏలూరు జిల్లా వేలూరుపాడులో 40.2, పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో 39.4, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో 33.4, శ్రీకాకుం జిల్లా కళింగపట్నంలో 22, పలాసలో 21.4, ప్రకాశం జిల్లా ముండ్లమూరులో 21.4, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 20.8, విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 20.4, పార్వతీపురంలో 20.4, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 18.8, పార్వతీపురం మన్యం జిల్లా గారుగుబ్బిలిలో 18.4, అనకాపల్లిలో 15.6, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాలంలో 15.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

గత నాలుగు రోజులుగా ఏపీలో వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలను వానలు ముంచెత్తాయి.. అలాగే కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడా పడ్డాయి. అయితే బుధవారం మాత్రం కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్ర కొనసాగడం విశేషం. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో ఎండలు దంచికొట్టాయి. రాయలసీమలో అక్కడక్కడా చిరు జల్లులు మినహా ఎక్కడా వర్షమే పడలేదు. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తాలోని ప్రాంతాలకు మాత్రమే వర్ష సూచన ఉండగా.. రాయలసీమలో అక్కడక్కడా చిరు జల్లులు పడే అవకాశం ఉందంటున్నారు. మరి అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు ఏ మేరకు కురుస్తాయన్నది చూడాలి.

  • Read More Andhra Pradesh News And Telugu News

Related Articles

Back to top button