News

Andhra Pradesh: వైద్యుల దాతృత్వం.. మూడేళ్ల చిన్నారికి 5 గంటలపాటు శ్రమించి అరుదైన శస్త్ర చికిత్స! ఉచితంగానే – Telugu News | Rare surgery performed on three year old Child after laboring for 5 hours at Rao’s Hospital in Guntur


విజయవాడ, నవంబర్ 17: కృష్ణా జిల్లా కైకాల దుర్గా ప్రకాష్ దంపతులకు మూడేళ్ల క్రితం కొడుకు పుట్టాడు. దీంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివెరిసింది. అతనికి అభిషిక్త్ పేరు పెట్టారు. అయితే ఆరు నెలల కాలానికే కొడుకు తల విపరీతంగా పెరగటం ప్రారంభం అయింది. మొదట సాధారణ జబ్బుగానే భావించిన ప్రకాష్ స్థానకంగా ఉండే వైద్యులకు చూపించారు. అయితే తల పెరగడంతో పాటు ఇతర సమస్యలున్నట్లు గుర్తించారు. దీంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లో అతనికి వైద్యం చేయలేని స్థానికంగా ఉండే వైద్యులు చెప్పారు. దీంతో కొడుకును బ్రతికించుకునేందుకు దుర్గా ప్రకాష్ అనేక ప్రయత్నాలు చేశాడు. 40 నుండి 60 సెంటీ మీటర్లు ఉండాల్సిన తల 90 సెంటీ మీటర్లకు పెరిగిపోయింది. దీంతో పాటు గుండెలో కుడి పక్క భాగం పూర్తిగా ఏర్పడలేదు. గుండెలో 10 నుండి 20 వరకూ ఉండాల్సిన ఒత్తిడి శాతం కూడా 138కి పెరిగిపోయింది. కొడుకులో వస్తున్న మార్పులు చూసి ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. అతన్ని బ్రతికించుకునేందుకు దేశంలోని అన్ని ఆసుపత్రుల చుట్టూ తిరగడం మొదలు పెట్టాడు.

మొదట స్విమ్స్ తిరుపతి హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ చిన్నారికి ఐసెన్ మెంగర్ సిండ్రోమ్ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. ఈ సిండ్రోమ్ ఉన్న వాళ్లకి తల పెరగటం, నీరు చేరడంతో పాటు ఎదుగుదల లోపిస్తుంది. అయితే ఆపరేషన్ చేయడానికి వైద్యులు ముందుకు రాలేదు. మెదడులో ఉన్న లోపంతో పాటు గుండెలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఆపరేషన్ చేసిన టేబుల్ మీదే యాభై శాతం మరణించే అవకాశం ఉందని చెప్పారు. స్విమ్స్ నుండి హైదరాబాద్ లోని కిమ్స్, నిమ్స్ ఆసుపత్రుల్లో చూపించారు. అక్కడ వైద్యులు చికిత్స చేయలేదు. మరోవైపు దుర్గా ప్రకాష్ ఆర్ధిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. లక్షల్లో ఖర్చు అయ్యే వైద్యం చేయించడం తన వల్ల కాలేదు.

అయితే ఢిల్లీలోని ఎయిమ్స్ కు తీసుకెళ్లారు. తక్కువకే వైద్యం అయిపోతుందన్న భావనతో ఢిల్లీ వరకూ వెళ్లారు. అక్కడ కూడా శస్త్ర చికిత్స చేసేందుకు నిరాకరించారు. ఇక కొడుకు మీద ఆశలు వదిలేసుకున్నారు. ఈ క్రమంలోనే గుంటూరులోని రావూస్ ఆసుపత్రి గురించి దుర్గా ప్రకాష్ కి తెలిసింది. అయితే ఆపరేషన్ కు అవసరమయ్యే డబ్బులు కూడా తన వద్ద లేవు. ఈ విషయం తెలుకున్న స్నేహితులు రావూస్ ఆసుపత్రి వైద్యుడు పాటిబండ్ల మోహన్ రావు కు అభిషిక్త్ గుర్తించి చెప్పారు. దీంతో మోహన్ రావు ఈ కేసును ఛాలెంజింగ్ తీసుకున్నారు. అతనికి మెదడులో మూడో గదిని ఓపెన్ చేసి స్టంట్ వేయడం ద్వారా బ్రతికించవచ్చని నిర్ధారించారు. ఇందుకు ఐదు లక్షల వరకూ ఖర్చు అవుతందని చెప్పారు. దుర్గా ప్రకాష్ కు అంత ఖర్చు పెట్టే స్తోమత లేదు. అదే విషయాన్ని మోహన్ రావుకు తెలిపారు. చిన్నారికి శస్త్ర చికిత్స చేయడం ఛాలెంజింగ్ తీసుకున్న వైద్యుడు ఉచితంగానే ఆపరేషన్ చేసేందుకు ముందుకు వచ్చారు.

ఇవి కూడా చదవండి

దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి అభిషిక్త్ కు శస్త్ర చికిత్స చేసి మెదడులో స్టంట్ వేశారు. ప్రస్తుతం చిన్నారి కోలుకుంటున్నాడు. లక్షల రూపాయల ఖర్చయ్యే ఆపరేషన్ ఉచితంగా చేసిన వైద్యుడికి చిన్నారి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. చిన్నారి పూర్తిగా కోలుకునే వరకూ ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించనున్నట్లు వైద్యుడు మోహన్ రావు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Advertisement

Related Articles

Back to top button