News

Andhra Pradesh: పాఠశాలలో కరెంట్ షాక్.. విద్యార్థి మృతి.. పరిహారం ప్రకటించిన సీఎం జగన్..


డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతుకుర్రు పాఠశాలలో విద్యుదాఘాతంతో విద్యార్థి చనిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి స్పందించారు. విద్యార్థులకు కరెంట్‌ షాక్‌..

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతుకుర్రు పాఠశాలలో విద్యుదాఘాతంతో విద్యార్థి చనిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి స్పందించారు. విద్యార్థులకు కరెంట్‌ షాక్‌ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన బాలుడి కుటుంబానికి రూ.10 లక్షలు నష్ట పరిహారం ప్రకటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.లక్ష పరిహారం ఇవ్వడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తోడుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. కాగా.. దొంతికుర్రులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యుదాఘాతంతో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఓ విద్యార్థి మృతి చెందాడు. వివేక్‌, సతీశ్‌ లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరో ఇద్దరు విద్యార్థులు నిఖిల్, మహిధర్​కు స్వల్ప గాయాలయ్యాయి. ఇనుప ఊచలను మిషన్​తో కోస్తుండగా విద్యుత్ సరఫరా అయింది. మంచినీరు తాగేందుకు వచ్చిన విద్యార్థులు ఊచలు పట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

వెంటనే అలర్ట్ అయిన స్థానికులు.. విద్యార్థులను అస్పత్రికి తరలిస్తుండగా నవీన్ అనే ఏడేళ్ల బాలుడు మార్గ మధ్యంలోనే చనిపోయాడు. మరో ఇద్దరు కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. మృతుడు నవీన్ తల్లి ఉపాధి కోసం గల్ఫ్​కు వెళ్లగా ముగ్గురు అక్కలతో కలిసి ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్, జిల్లా ఏఎస్పీ కె.లతామాధురి పరామర్శించారు. మృతి చెందిన విద్యార్థి నవీన్‌ కుటుంబీకులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button