Andhra Pradesh: చంద్రబాబుతో ఆనం రాంనారాయణ భేటీ.. వాటిపైనే చర్చలు.. ఇక త్వరలోనే – Telugu News | YSRCP MLA Anam Ramnarayana Reddy Meets Chandra Babu Naidu in Hyderabad
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి భేటీ అయ్యారు. గత రాత్రి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. సమారు గంట పాటు వీరిమధ్య సమావేశం జరిగింది. ముఖ్యంగా నెల్లురు జిల్లాలోని రాజకీయాలపై.. వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేసే విషయంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

Anam And Cbn
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి భేటీ అయ్యారు. గత రాత్రి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. సమారు గంట పాటు వీరిమధ్య సమావేశం జరిగింది. ముఖ్యంగా నెల్లురు జిల్లాలోని రాజకీయాలపై.. వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేసే విషయంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈరోజు ఆనం రాంనారాయణ రెడ్డి తన అనుచరులతో సమావేశం కానున్నారు.
అయితే లోకేష్ పాదయాత్ర నెల్లూరుకి వచ్చేసరికి ఆనం పార్టీ మారనున్నట్లు సమాచారం. ఇప్పటికే వైసీపీ పార్టీ నుంచి ఆనం సస్పెండ్ అయ్యారు. ఇదిలా ఉండగా ఒంగోలు మహనాడు సందర్భంగా లోకేష్‌తో ఆనం కుమార్తె కూడా సమావేశమైంది. అయితే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే టికెట్ ఇవ్వాలని టీడీపీ భావిస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు లోకేష్ పాదయాత్రకు స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం