News

Andhra Pradesh: ఎంబీఏ కావాలా..? ఇంజనీరింగ్ కావాలా..? ఏ సర్టిఫికేట్ అయినా ఓకే అన్నారు.. కట్ చేస్తే..


ఎంబీఏ సర్టిఫికేట్ కావాలా.. అయితే ఓకే.. ఇంజనీరింగ్ సర్టిఫికేట్ కావాలా అయినా ఓకే.. బీఫార్మసీ, ఇంకా డిగ్రీ సర్టిఫికెట్‌ ఇలా ఏదైనా వెంటనే ఇచ్చేస్తాం.. ఏ యూనివర్సిటీ నుంచి కావాలన్నా ఏర్పాటు చేస్తాం.. మన చేతిలో పనే.. రండి బాబు.. రండి..

ఎంబీఏ సర్టిఫికేట్ కావాలా.. అయితే ఓకే.. ఇంజనీరింగ్ సర్టిఫికేట్ కావాలా అయినా ఓకే.. బీఫార్మసీ, ఇంకా డిగ్రీ సర్టిఫికెట్‌ ఇలా ఏదైనా వెంటనే ఇచ్చేస్తాం.. ఏ యూనివర్సిటీ నుంచి కావాలన్నా ఏర్పాటు చేస్తాం.. మన చేతిలో పనే.. రండి బాబు.. రండి.. అంటూ ఫెక్‌ సర్టిఫికెట్లను అడ్డగోలుగా అమ్మారు.. నిన్నటి వరకూ పల్నాడు జిల్లా (గుంటూరు) పరిధిలోని నరసరావుపేటలో అన్ని రకాల ఉన్నత విద్యా సర్టిఫికేట్లు సరసమైన ధరలకే లభ్యం అయ్యాయి. పోలీసులు ఎంటర్‌ కావడంతో.. అసలు గుట్టు మొత్తం వెలుగులోకి వచ్చింది. ఫేక్ సర్టిఫికేట్ ముఠా ఆగడాలకు.. పోలీసులు తెర దించడంతోపాటు.. పలు ఆసక్తికర విషయాలను వారి నుంచి రాబట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సరావుపేటలోని ప్రకాష్ నగర్‌కు చెందిన శ్యామ్ ప్రసన్న ఎంబీఏ చదివాడు. కొద్దిరోజులపాటు హైదరాబాద్‌లో పనిచేసి వచ్చి.. నరసరావుపేటలోని సన్నీ పేటలో తన ఇంటి వద్దే ఇంటర్నెట్ సెంటర్ పెట్టుకున్నాడు. ఈ సెంటర్‌లో జిరాక్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డు లాంటివి డౌన్ లోడ్ చేయడంతోపాటు జిరాక్స్‌ తీసేవాడు. అయితే అతని ఇంటికి సమీపంలోనే వెంకట రామారావు కూడా నెట్ సెంటర్ నడిపేవాడు. డిగ్రీ చదివిన వెంకట రామారావుకి.. శ్యామ్ ప్రసన్నకి ఇద్దరికి పరిచయం ఏర్పడింది.

అయితే నరసరావుపేటకి చెందిన మణికంఠ కూడా ఎంబీఏ చదివాడు. కొన్ని సబ్జెక్ట్‌లు మిగలడంతో ఈ విషయాన్ని శ్యామ్ ప్రసన్నకి చెప్పాడు. అయితే సర్టిఫికేట్ కదా నీకు కావాల్సింది నేను ఇస్తానని మణికంఠకి శ్యామ్ హామీనిచ్చాడు. ఒక్కో సబ్జెక్ట్ కు పదివేల రూపాయలు ఖర్చువుతుందని కూడా తెలిపాడు. ఆ తర్వాత శ్యామ్ ప్రసన్న.. వెంకట రామారావుతో కలిసి సర్టిఫికేట్ తయారు చేశారు. అ సర్టిఫికేట్ మణికంఠకు ఇచ్చి పదివేల రూపాయలు తీసుకున్నాడు. ఇదే తరహాలో పలువురికి సైతం నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చారు. వివిధ యూనివర్సిటీలకు సంబంధించిన సర్టిఫికేట్ పేపర్లను కొని వాటిని దాచి ఉంచేవారు. ఎవరైన వస్తే వారికి తప్పిన సబ్జెక్ట్‌లలో మార్కులు దిద్ది ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేసి ఇచ్చేవారు. అదే విధంగా సర్టిఫికేట్లలో ఫోటోలు మార్చడం, డిజిటైల్ సైన్ మార్చడం లాంటివి కూడా చేసేవారు.

Fake Certificate Gang

Fake Certificate Gang

వీరిద్దరూ కలిసి గుంటూరుకు చెందిన మహేష్ తో కలిసి వివిధ సర్టిఫికేట్లు తయారు చేయించేవారు. అదే విధంగా విదేశాల్లో చదువుకునే వాళ్లకి అవసరమైన ట్రాన్స్ స్క్రిప్ట్ కూడా చేసేవారు. అయితే మణికంఠపై అనుమానం వచ్చి దృష్టి పెట్టిన పోలీసులకు నకిలీ సర్టిఫికేట్‌తో దొరికి పోయాడు. అప్పటి నుంచి ఈ ముఠాపై పోలీసులు నిఘా పెట్టి శ్యామ్ ప్రసన్న, వెంకట రామారావులను అరెస్ట్‌ చేశారు. అనంతరం వారి శైలిలో ప్రశ్నించగా.. అసలు విషయాలు బయటకు వచ్చాయి.

ఇప్పటి వరకూ ఏడుగురికి నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చినట్లు విచారణలో ఒప్పుకున్నారని.. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశకంర్ రెడ్డి తెలిపారు. అక్రమార్కులు చెప్పిన మాట విని విద్యార్ధులు నకిలీ సర్టిఫికేట్లు తీసుకొని మోసపోవద్దని ఎస్పీ హెచ్చరించారు. ఈ ముఠాలో మరి కొంతమంది ఉన్నారని వారందరిని పట్టుకుంటామని తెలిపారు. కాగా.. నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు.. వెలుగులోకి రావడంతో.. స్థానికంగా కలకలం రేపింది.

Advertisement

– రిపోర్టర్: టి నాగరాజు, టీవీ9 తెలుగు, గుంటూరు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

ఇవి కూడా చదవండిలేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button