Andhra Pradesh: ఈనెల 13న ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు | Andhra Pradesh: Govt announces holiday on march 13th due MLC Election polling Telugu News
ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 13న సెలవు దినంగా ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు.

Andhra Pradesh Mlc Election
ఏపీలో ఈనెల 13న గవర్నమెంట్ హాలిడేగా అనౌన్స్ చేసింది. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా 13వ తేదీ సెలవు దినంగా ప్రకటిస్తూ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోని షాపులు, పాఠశాలలు, గవర్నమెంట్, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు.
సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా సంవత్సరం ముందు జరగతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి. ఈ ఎన్నికలను పార్టీలు మినీ అసెంబ్లీ పోరుగా భావిస్తున్నాయి. తాము బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు వ్యూహరచన చేస్తున్నాయి అధికార, ప్రతిపక్షాలు. పోలింగ్‌కు టైం దగ్గర పడే కొద్దీ అభ్యర్థులు ..ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గెలిచేందుకు చిన్న ఛాన్స్ ఉన్నా కూడా మిస్ చేసుకోవడం లేదు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..