Entertainment

Vishnu priya: విష్ణు ప్రియను వదలని సైబర్ నేరగాళ్లు.. రోజు రోజుకు మితిమీరుతున్నారుగా..!!


. తన ట్విట్టర్ ను ఎవరో హ్యాక్ చేశారని.. నెట్టింట హంగామా చేసిన విష్ణు ప్రియ ఇప్పటికీ… తన అకౌంట్‌ను విడిపించుకోలేక తంటాలు పడుతున్నారు. సైబర్ క్రైమ్‌ కు కంప్లైట్ చేసినా… ఎఫ్‌బీకి రిక్వెస్ట్ చేసినా..

పాపం..! పగోడికి కూడా ఈ పరిస్థితి రావద్దంటున్నారు.. యాంకర్ విష్ణ ప్రియ పరిస్థితి చూసిన నెటిజన్లు. ఫేస్ బుక్‌లో ఈమె అకౌంట్‌ను చూస్తూ.. పాపం అంటూ.. ఫీలవుతున్నారు. ఈమె స్టేటస్‌లో వచ్చే బూతు బొమ్మలు చూడలేక తల పట్టుకుంటున్నారు. అన్‌ఫాలో చేస్తూ.. ఈమె పరిస్థితి తలుచుకుంటూ ఫీలవుతున్నారు. అప్పుడెప్పుడో.. తన ట్విట్టర్ ను ఎవరో హ్యాక్ చేశారని.. నెట్టింట హంగామా చేసిన విష్ణు ప్రియ ఇప్పటికీ… తన అకౌంట్‌ను విడిపించుకోలేక తంటాలు పడుతున్నారు. సైబర్ క్రైమ్‌ కు కంప్లైట్ చేసినా… ఎఫ్‌బీకి రిక్వెస్ట్ చేసినా.. తన అకౌంట్‌ తనకు కాకుండా పోవడంతో … చేతులెత్తేశారు. ఇక చేసేదేం లేక.. అప్పటి నుంచి ఇప్పటి వరకు .. తనను ఫేస్ బుక్ లో అన్‌ఫాలో చేయండని తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను వేడుకుంటూనే ఉన్నారు.

అయితే ఇదంతా బానే ఉన్నా… విష్ణు ప్రియ ఫేస్ బుక్ హ్యాక్ చేసిన హ్యాకర్ మాత్రం రోజు రోజుకూ రెచ్చి పోతున్నాడు. విష్ణు ప్రియ స్టేటస్‌లో బూతు ఫోటోలు.. పోర్న్‌ వీడియోలను పోస్ట్ చేస్తున్నాడు. విష్ణు ప్రియతో పాటు.. తన ఫాలోవర్స్‌ను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ స్టేటస్‌లు చూసిన ఆమె ఫాలోవర్స్ అండ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆమె గురించి.. ఆలోచించి బాధపడుతున్నారు. ఇదే విషయాన్ని నెట్టింట ఎక్స్‌ ప్రెస్ చేస్తున్నారు. తన అకౌంట్‌ను ఎలాగైనా రికవరీ చేసి.. విష్ణు ప్రియకు ఇవ్వాల్సిందిగా ఫేస్ బుక్ ను కోరుతున్నారు. ఇదిలా ఉంటే రోజు రోజు హ్యాకర్ వ్యవహారం ముదిరిపోతోంది. ఇంకా దారుణమైన ఫోటోలను షేర్ చేస్తున్నారు. మరి ఇప్పటికైన ఈ సైబర్ నేరగాళ్లను పోలీసులు కట్టడి చేస్తారేమో చూడాలి.

ఇవి కూడా చదవండి



లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button